నాని కెరీర్ లో హయ్యస్ట్ రికార్డ్

రాను రాను తెలుగు సినిమా మార్కెట్ పెరుగుతోంది. స్పాన్ విస్తరిస్తోంది. హీరో నాని లేటెస్ట్ సినిమా ఫిగర్స్ కావచ్చు. రాబోయే ఇంకా చాలా సినిమాల, ఇంకా ఫైనల్ కాని మార్కెట్ ఫిగర్స్ కానీ తెలుసుకుంటే…

రాను రాను తెలుగు సినిమా మార్కెట్ పెరుగుతోంది. స్పాన్ విస్తరిస్తోంది. హీరో నాని లేటెస్ట్ సినిమా ఫిగర్స్ కావచ్చు. రాబోయే ఇంకా చాలా సినిమాల, ఇంకా ఫైనల్ కాని మార్కెట్ ఫిగర్స్ కానీ తెలుసుకుంటే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వస్తుంది.

హీరో నాని చేస్తున్న లేటెస్ట్ సినిమా దసరా. రఫ్ అండ్ రగ్డ్ బ్యాక్ డ్రాప్ లో తయారవుతున్న సినిమా ఇది. ఈ సినిమా బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయింది.

నాన్ థియేటర్ ను గతంలోనే ఫినిష్ చేసారు. నాన్ థియేటర్ అంతా కలిపి 50 కోట్ల మేరకు బిజినెస్ చేసారు. థియేటర్ బిజినెస్ ను కూడా ఇప్పుడు సింగిల్ పాయింట్ కింద సేల్ చేసేసారు. ఓవర్ సీస్ మినహా మిగిలిన థియేటర్ హక్కులను 27 కోట్లకు అమ్మేసారు.

చదలవాడ శ్రీనివాసరావు సింగిల్ పాయింట్ లో ఈ డీల్ ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అంటే టోటల్ గా దాదాపు 85 కోట్ల మేరకు సినిమా బిజినెస్ జరిగినట్లు.

కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం కూడా వుంది. ఎప్పుడూ నలభై, యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది నాని సినిమాలకు. కానీ ఈ సినిమాకు 70 కోట్లు దాటేస్తోంది ఖర్చు. 60 కోట్ల అంచనాతో దిగితే అది 70 చేరుకుంటోందని తెలుస్తోంది. ఆపై పబ్లిసిటీలు, ఇంట్రస్ట్ లు వుండనే వుంటాయి.

అంటే ఎంత స్పాన్ పెరిగినా, మార్కెట్ పెరిగినా చివరకు నిర్మాత దగ్గరకు వచ్చేసరికి అదే అరకొర లాభాలు అన్నమాట.