కామ్రేడ్‌ షేపు, రూపు మార్చేసారు

'డియర్‌ కామ్రేడ్‌' ట్రెయిలర్‌కి విశేషమైన స్పందన లభిస్తోంది. మళ్లీ 'అర్జున్‌రెడ్డి' మోడ్‌లో విజయ్‌ దేవరకొండ 'యాంగ్రీ యంగ్‌మ్యాన్‌'గా బాగున్నాడనే కితాబులు దక్కుతున్నాయి. విజయ్‌ దేవరకొండ, రష్మికల నడుమ కెమిస్ట్రీ ఈ ట్రెయిలర్‌లో హైలైట్‌గా నిలిచింది.…

'డియర్‌ కామ్రేడ్‌' ట్రెయిలర్‌కి విశేషమైన స్పందన లభిస్తోంది. మళ్లీ 'అర్జున్‌రెడ్డి' మోడ్‌లో విజయ్‌ దేవరకొండ 'యాంగ్రీ యంగ్‌మ్యాన్‌'గా బాగున్నాడనే కితాబులు దక్కుతున్నాయి. విజయ్‌ దేవరకొండ, రష్మికల నడుమ కెమిస్ట్రీ ఈ ట్రెయిలర్‌లో హైలైట్‌గా నిలిచింది. యువతని ఆకర్షించాలని గట్టిగా ప్రయత్నిస్తోన్న చిత్ర రూపకర్తల కృషి ఫలించింది. డియర్‌ కామ్రేడ్‌ మంచి ఓపెనింగ్స్‌ సాధించడం ఖాయమని ట్రేడ్‌ అంటోంది.

ఇకపోతే ఈ చిత్రం ప్రమోషన్స్‌ మాత్రమే కాకుండా క్రియేటివ్‌ విషయాలలో కూడా విజయ్‌ దేవరకొండ బాగా ఇన్‌వాల్వ్‌ అయినట్టు వార్తలొస్తున్నాయి. ముందుగా ఫిక్స్‌ చేసుకుని తీసిన క్లయిమాక్స్‌ కూడా మళ్లీ రీషూట్‌ చేయించాడని గాసిప్స్‌ వున్నాయి. ఎమోషనల్‌ క్లయిమాక్స్‌ని, ట్రాజిక్‌ ఎండింగ్‌ని ముందుగా దర్శకుడు భరత్‌ కమ్మ ఫైనలైజ్‌ చేస్తే, అది బెడిసికొట్టే అవకాశముందని మార్చేసారట.

ఈ చిత్రం ప్రథమార్ధం కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో యూత్‌ఫుల్‌గా సాగినా, ద్వితియార్ధం కాస్త హెవీ ఎమోషన్స్‌తో సాగుతుందట. రష్మిక చాలా ఎమోషనల్‌ పాత్ర పోషించిందట. సెకండ్‌ హాఫ్‌ ఎంతగా కనక్ట్‌ అయితే డియర్‌ కామ్రేడ్‌ అంతగా మెప్పిస్తుందని చెబుతున్నారు. 

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?