నిఖిల్ సినిమాకు శర్వా బ్రేక్?

యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థకు నడుస్తున్న బ్యాడ్ టైమ్ ఇంతా అంతా కాదు. ప్రతి సినిమాకు ఏదో ఒక సమస్యనే. విడదుల దగ్గరయ్యేసరికి కిందామీదా కావడమే. అది కార్తికేయ కావచ్చు, కిర్రాక్ పార్టీ కావచ్చు.…

యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థకు నడుస్తున్న బ్యాడ్ టైమ్ ఇంతా అంతా కాదు. ప్రతి సినిమాకు ఏదో ఒక సమస్యనే. విడదుల దగ్గరయ్యేసరికి కిందామీదా కావడమే. అది కార్తికేయ కావచ్చు, కిర్రాక్ పార్టీ కావచ్చు. లేటెస్ట్ గా అర్జున్ సురవరం కూడా అంతే. మాంచి ప్రామిసింగ్ ప్రాజెక్టు అయిన అర్జున్ సురవరం కూడా అలాగే అయింది. మాంచి ప్రామిసింగ్ ఫ్రాజెక్టు. జనాదరణ పక్కా అనుకున్న ఆ ప్రాజెక్టు, రెడీ టు రిలీజ్ అయి కూడా పలు కారణాలతో ఆగిపోయింది.

దాని తరువాత శ్వాస సినిమా చేద్దాం అంటే అది ఇలా ప్రారంభమై అలా ఆగిపోయింది. ఇవన్నీకాదు, కార్తకేయ సీక్వెల్ చేద్దాం అని పీపుల్స్ మీడియాతో కలిసి డిసైడ్ అయ్యారు. కానీ అది కూడా అంత సులువుగా జరిగేలా కనిపించడం లేదు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఇస్తేనే ముందుకు వెళ్తామని పీపుల్స్ మీడియా సంస్థ స్పష్టంచేసింది. మరో పక్కన దర్శకుడు చందుమొండేటి ఈ ప్రాజెక్టు కన్నా శర్వానంద్ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నట్లు బోగట్టా.

శర్వానంద్ కూడా నవంబర్ వేళకు డేట్స్ ఇస్తానని, వెయిట్ చేయమని చందుకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే కార్తికేయ 2 ఇక ఇప్పట్లో వుండదు. ఎందుకంటే శర్వా-చందు సినిమా ఫినిష్ అయి, హిట్ అయితే, చందు చూపు వేరే వైపు వుండొచ్చు.

మరి ఎందుకునో నిఖిల్ మరో ప్రాజెక్టు వైపు చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిజానికి హీరోలు ఎవ్వరూ దొరక్క నిర్మాతలు వెదుకులాడుతున్నారు. కానీ ఇలాంటి టైమ్ లో నిఖిల్ కు ఎందుకు అవకాశాలు రావడం లేదో అన్నది అతనే ఆలోచించుకోవాలేమో?

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?