సమంత టైటిల్ రోల్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓ బేబీ' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్టడీ కలక్షన్లతో సక్సెస్ దిశగా పయనిస్తోంది. ఈ వారాంతంతో లాభాల బాట పట్టనుంది. సమంతకి సోలో హీరోయిన్‌గా తొలి విజయాన్ని అందించిన ఈ చిత్రం 'మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి రీమేక్. భాషలకి, ప్రాంతాలకి అతీతంగా సక్సెస్ అయిన ఈ కథ ఏ భాషలో అయినా విజయం సాధిస్తుందని రానా దగ్గుబాటి దీనిని హిందీలోకి రీమేక్ చేయాలని భావిస్తున్నాడు.
తెలుగులో సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం చూడగానే హిందీ రీమేక్‌పై రానా ఆలోచనలు స్టార్ట్ చేసాడు. తెలుగునాట దక్కిన ప్రశంసలు, విజయంతో హిందీ రీమేక్ పనులు వేగవంతం చేసాడు. ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ హిందీ రీమేక్‌లో ప్రధాన పాత్ర పోషించే అవకాశముందని అంటున్నారు. ఇంకా దర్శకుడు ఎవరనేది ఫిక్స్ కాలేదు కానీ రానా అయితే కొన్ని బాలీవుడ్ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నాడు.
ఆలియా అయితే 'ఓ బేబీ'కి కంప్లీట్ జస్టిస్ చేయగలదు. ఎలాంటి పాత్రలోకి అయినా పరకాయ ప్రవేశం చేసేసే ఆలియా భట్ ఇటు కామెడీతో పాటు అటు ఎమోషనల్ సన్నివేశాలని కూడా రక్తి కట్టించగలదు. కానీ ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు రాజమౌళి మల్టీస్టారర్‌తోను చాలా బిజీగా వుంది కనుక ఆమె డేట్స్ కోసం రానా చాలా కాలం వేచి చూడక తప్పదు.