అసలే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ నోరు అంత మంచిది కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడ్డంలో నారాయణ తర్వాతే ఎవరైనా! మరే నాయకుడైనా ఇట్లా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కమ్యూనిస్టు పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణ అవాకులు చెవాకులు పేలుతూ, జనంతోనూ, పార్టీ నేతలతోనూ చీవాట్లు తింటూ వుంటారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు బాగా అలవాటైన విద్య.
అలాంటి నారాయణ నోట్లో హీరో నాగార్జున నోరు పెట్టారు. బిగ్‌బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్‌గా అభివర్ణించడం…ఆ రియాల్టీ షో అభిమానులక మనసుని గాయపరిచింది. దీంతో నారాయణకు కౌంటర్ అన్నట్టు…. వీకెండ్ షోలో నాగార్జున సినిమాటిక్‌గా పంచ్ విసిరారు.
హౌస్‌లోకి కంటెస్టెంట్లగా వెళ్లిన రోహిత్-మెరీనా జంటను హగ్ చేసుకోవాలని సూచిస్తాడు. తనతో సన్నిహితంగా రోహిత్ మెలగలేదనే ఆవేదనతో ఉన్న మెరీనాకు ఊరట కలిగిస్తారు. ఇద్దరికీ లైసెన్స్ వుందని, బిగువైన కౌగిలింత చేసుకోవాలని సూచిస్తాడు. ఆ జంట కౌగిలింతలో ఉండగా… “నారాయణ నారాయణ వాళ్లిద్దరూ మ్యారీడ్” అంటూ నాగార్జున కౌంటర్ ఇస్తారు.
వాళ్లిద్దరూ జంట కాబట్టి హగ్ చేసుకోవడంలో తప్పు లేదని నాగార్జున ఉద్దేశం. మరి మిగిలిన వాళ్ల సంగతేంటని? నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న నారాయణ సంధించే అవకాశాలున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో దంపతులు కాని వారి కౌగిలింతలపై నాగార్జున సమాధానం ఏంటనే ప్రశ్నలకు సమాధానం ఏంటి? అనవసరంగా నాగార్జున గెలుక్కున్నారేమో అనే ప్రశ్నలొస్తున్నాయి.
ఆ విషయాన్ని వదిలేసి వుంటే నారాయణ మాటలకు విలువ లేకుండా పోయేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున కౌంటర్‌తో బిగ్‌బాస్ వ్యతిరేకులకు అవకాశాన్ని ఇచ్చినట్టు అయ్యిందంటున్నారు.