విజయ్ సినిమాల ట్రయిలర్

విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రమేకాదు, టాలీవుడ్ జనాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డియర్ కామ్రేడ్ ట్రయిలర్ వచ్చేసింది. ట్రయిలర్ ఆకట్టుకుందా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే, విజయ్ అభిమానులను ఆకట్టకునేలా, బాగుంది అని…

విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రమేకాదు, టాలీవుడ్ జనాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డియర్ కామ్రేడ్ ట్రయిలర్ వచ్చేసింది. ట్రయిలర్ ఆకట్టుకుందా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే, విజయ్ అభిమానులను ఆకట్టకునేలా, బాగుంది అని అనిపించేలా ట్రయిలర్ కట్ చేయడానికి మాత్రం చాలా ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది.

ట్రయిలర్ లో ప్రతి సీన్ విజయ్ దేవరకొండ గత సినిమాలను పక్కాగా గుర్తు చేస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి, నోటా ఇలా ప్రతి సినిమాను గుర్తుచేసేలా వున్నాయి సీన్లు. విజయ్ ను ఎలా చూస్తే అభిమానులు ఇష్టపడతారో అలా ప్రెజెంట్ చేసినట్లు కనిపిస్తోంది.

అగ్రెసివ్ నెస్, ఎమోషన్, రొమాన్స్ ఇలా అన్ని షేడ్స్ చూపించారు. అంతేకాదు, సినిమా లైన్ కూడా చాలావరకు రివీల్ చేసేసారు. మొత్తంమీద విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ట్రయిలర్ నచ్చేలాగే వుంది కానీ, కొత్తదనం మాత్రం కనిపించలేదనే చెప్పాలి.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?