cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో ఫస్ట్ హాఫ్ 1.20?

సాహో ఫస్ట్ హాఫ్ 1.20?

బాహుబలి ఫ్రభాస్ లేటెస్ట్ భారీ సినిమా సాహో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చకచకా పూర్తి చేస్తున్నారు. మరో నెలరోజుల్లో విడుదల డేట్ వుండడంతో, లాస్ట్ మినిట్ హర్రీ లేకుండా చూడాలని గట్టిగా వర్క్ చేస్తున్నారు. చాలా భాషల్లో విడుదల చేయాల్సి వుండడం, బాలీవుడ్ లో భారీ విడుదల ప్లాన్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రింట్లు పంపాల్సి వుండడం వంటి కారణాలతో పదిరోజులు ముందుగానే అన్నీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

సినిమా తొలిసగాన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. గంట ఇరవై నిమషాల నిడివి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇక్కడ లాక్ చేసారు. మలి సగం కూడా ఫైనల్ ఎడిట్ జరిగి లాక్ చేసిన తరువాత మొత్తం సినిమాను చూసుకుని, అప్పుడు అలా వుంచాలా? ఏమైనా తగ్గించాలా? అన్నది డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి గంటా ఇరవై నిమిషాలు అంటే కాస్త ఎక్కువే. అందులో అయిదు, పది నిమషాలు తగ్గితే మంచిది అని యూజువల్ గా సినిమా జనాలు అంటారు. మరి సాహా మేకర్లు ఏం చేస్తారో చూడాలి.

నిర్మాతల్లో ఒకరైన వంశీ, దర్ళకుడు సుజిత్ తో కలిసి చెన్నయ్ లోనే వుండి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం సూపర్ వైజ్ చేసుకుంటున్నారు. హీరో ప్రభాస్, కొరియాగ్రాఫర్, వగైరా టీమ్ తో వెళ్లి సాంగ్స్ ఫినిష్ చేసారు. విజువల్ ఎఫెక్ట్ వర్క్ లు దాదాపు పూర్తి అయిపోయినట్లే. అవి పూర్తయిపోతే టెన్షన్ ఫ్రీగా వుంటారు. మిగిలిన పనులు అన్నీ దాదాపు ఓ కొలిక్కి వచ్చేసాయి.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?