తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎన్నిక అనేది అన్ని రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్ గా ఉంది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ రోజుకు ఒక ఎత్తు వేసుకుంటూ ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే పొలిటికల్ హిట్ పెంచుతున్నారు. ఈ ముగ్గురి మధ్యలో ప్రపంచ శాంతి దూత, కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ ఎంటర్ అయింది. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో కేసీఆర్ను చిత్తుగా ఓడగొడతానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు.
మునుగోడులో ప్రజాశాంతి పార్టీ గెలిచిన ఆరు నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఉచిత విద్య, మునుగోడులోని ప్రతి గ్రామంలోను తన చారిటీ ద్వారా ఉద్యోగాలు ఇస్తానని, ప్రజలందరూ ముందుకు వచ్చి ప్రజాశాంతిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతి పాలనకు ఇంకా కాలం చెల్లిందన్నారు.
వచ్చే నెలల్లో హైదారాబాద్ లో నిర్వహించే గ్లోబర్ పీస్ మీటింగ్ కు 28 దేశాల అధ్యక్షులు, ప్రధానులు వస్తున్నారని, ఈ మీటింగ్ కు అహ్వానిద్దామంటే అహంతో నన్ను కలవడం లేదని, తెలంగాణ బాగుచేద్దామనుకుంటే కేసీఆర్ సహకరించడం లేదన్నారు కేఏ పాల్. తెలంగాణ రాక ముందు కేసీఆర్ ఆస్తి ఎంత.. ఇప్పుడు ఆస్తి ఎంత అని ప్రశ్నించారు.
గతంలో బీజేపీకి సపోర్టు చేసిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రంపై యుద్దం అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పార్టీకి ఓట్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ, కేఏ పాల్ మీడియాతో మాట్లాడినా వీడియోలు మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలు విపరితంగా చూస్తారన్నది నిజం.