కృష్ణ..వృింద…రొమాంటిక్ లవ్ స్టోరీ

నాగశౌర్య లేటెస్ట్ మూవీ కృష్ణ..వృింద..విహారి సినిమా ట్రయిలర్ విడుదలయింది. ఈ నెల 23న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ గా కట్ చేసారు. సినిమా…

నాగశౌర్య లేటెస్ట్ మూవీ కృష్ణ..వృింద..విహారి సినిమా ట్రయిలర్ విడుదలయింది. ఈ నెల 23న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ గా కట్ చేసారు. సినిమా సబ్జెక్ట్ కూడా అలాగే వున్నట్లు కనిపిస్తోంది. 

సాంప్రదాయ కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ అబ్బాయి, అల్ట్రా మోడరన్ ప్లస్ బాస్ అయిన అమ్మాయితో ప్రేమలో పడడం, దాని పర్యవసానంగా తలెత్తే పరిణామాలు కథ అని తెలుస్తూనే వుంది. కానీ ఆ పరిణామాలు ఏమిటన్నది మాత్రం ట్రయిలర్ లో హైడ్ చేసారు.

హీరో..హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ ముందుకు తెచ్చి, హీరో ఫ్యామిలీ వ్వవహారాలు దాచేసారు. ట్రయిలర్ ను యూత్ ఫుల్ గా కట్ చేసి, జనాలను థియేటర్ కు రప్పించడంమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి సబ్జెక్ట్ లో సగం సినిమా ఎమోషనల్ టచ్, ఫ్యామిలీ సెంటి మెంట్ వుండే వుంటుంది. వాళ్ల బాధలు అన్నీ భరించే మనం గొప్పోళ్లం అనే యాంగిల్ లో హీరో చెప్పే డైలాగు సినిమాలో కుటుంబానికి..ప్రేయసికి మధ్య నలిగే హీరో వ్యవహారాన్ని చెబుతూనే వుంది.

ట్రయిలర్ లో ఫన్ కంటెంట్ కూడా బాగానే వుంది. దర్శకుడు అనీష్ కృష్ణ కు ఫన్ టైమింగ్ వుంది. అది ట్రయిలర్ లో కనిపించింది. టోటల్ గా చూసుకుంటే ఈ ఫన్, లవ్ రొమాంటిక్ జర్నీ వరకు సినిమా పాస్ అయినట్లే. ఫ్యామిలీ సెంటిమెంట్ మోతాదు ఏ రేంజ్ లో వుందో తెలియాల్సి వుంది.