మెగా కుటుంబంలో ఎవ్వరూ చెప్పని మాటలు రామ్ చరణ్, తనతో చెప్పాడని అంటున్నాడు వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లోనే మనసుకు నచ్చిన సినిమాలు చేయాలని, స్టార్ డమ్ వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు చేయలేమని, అందుకే డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించాడు వరుణ్ తేజ్.
“నేను 7వ సినిమా చేస్తున్నప్పుడు మా అన్నయ్య చరణ్ నాతో ఓ మాట అన్నాడు. కొత్తగా ప్రయత్నించడానికి ఇది సరైన టైమ్ అని, మనసుకు నచ్చిన సినిమా చేయాలని చెప్పాడు. భవిష్యత్తులో బిజినెస్, మార్కెట్ పెరిగిన తర్వాత కొన్ని సినిమాలు చేయలేం అన్నాడు. కాబట్టి ఇప్పట్నుంచే అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నమ్మిన సినిమా చేయమన్నాడు. కొన్ని కథలు చేయాలని అనిపించినా తను చేయలేకపోతున్నానని, అలాంటి ట్రాప్ లో పడొద్దని నాకు సూచించాడు.”
సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందనే టెన్షన్ పెట్టుకోకుండా, మూవీ మేకింగ్ జర్నీని ఎంజాయ్ చేయాలని చరణ్ తనతో చెప్పాడని, ప్రస్తుతం తను అదే చేస్తున్నానని అన్నాడు వరుణ్ తేజ్. డిఫరెంట్ మూవీస్ చేయాలని తన కుటుంబంలో ఎవ్వరూ చెప్పలేదని, ఒక్క చరణ్ మాత్రమే చెప్పాడని అంటున్నాడు.
ఇప్పటికీ చరణ్ చెప్పిన ఆ మాటల్నే తను ఫాలో అవుతున్నానని అన్నాడు వరుణ్ తేజ్. ఈ హీరో నటించిన తాజా చిత్రం గాండీవధారి అర్జున. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు సంబంధించి మీడియా ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు.