పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ఆలోచన లేదు

పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీలేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ…

పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీలేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్‌ అలాంటి సిఫార్సు ఏదీ చేయలేదని చెప్పారు. అలాగే పెట్రో ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై అధ్యయనం చేసేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ ఎలాంటి సిఫార్సు చేయలేదని రెవెన్యూశాఖ తెలిపినట్లు మంత్రి చెప్పారు.

రాజ్యాంగంలోని ఏడవ అధికరణం కింద పొందుపరచిన జాబితా ప్రకారం పెట్రోలియం క్రూడ్‌, హైస్పీడ్‌ డీజిల్‌, మోటర్‌ స్పిరిట్‌, గ్యాస్‌, విమానాలకు వినియోగించే ఇంధనంపై సుంకం విధించే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉన్నట్లు మంత్రి తెలిపారు.

దెయ్యాన్ని పట్టుకోవడానికి పోలీసును పిలవడం ఏంటి రాజా