కలెక్టర్లతో సమీక్ష.. జగన్ సంచలన నిర్ణయాలు!

కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతి అంశం గురించినే ప్రముఖంగా ప్రస్తావించారు. తనవైపు నుంచి అవినీతిపై చర్యల విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టంచేశారు.…

కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతి అంశం గురించినే ప్రముఖంగా ప్రస్తావించారు. తనవైపు నుంచి అవినీతిపై చర్యల విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టంచేశారు. అవినీతి రహిత వ్యవస్థను తయారు చేయడంలో తనవైపు నుంచి 50 శాతం కృషి ఉంటుందని, మిగిలిన యాబైశాతం మాత్రం అధికారుల వైపు నుంచినే ఉండాలని జగన్ ఆదేశించారు. ఇందులో రాజీపడే ప్రసక్తిలేదని మరోసారి స్పష్టతను ఇచ్చారు సీఎం.

అవినీతి విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని, తన పార్టీ వారు, ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడాలు ఉండవని.. ఈ విషయాన్ని అధికారులు కూడా అర్థం చేసుకోవాలని జగన్ తేల్చిచెప్పారు. కలెక్టర్ల సమీక్షలో ఈ విషయంపై జగన్ నొక్కిచెప్పడం గమనార్హం.

ఇక గత ఐదేళ్లలో నమోదైన రైతు ఆత్మహత్యల విషయంలో కూడా జగన్ స్పందించారు. వెయ్యి మందికి పైగా రైతులు ఆర్థిక సమస్యలతో మరణిస్తే వారిలో మూడు వందల మందికి మాత్రమే పరిహారాలు ఇచ్చారని జగన్ చెప్పారు. అందరికీ ఏడు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించబోతున్నట్టుగా ప్రకటించారు. 

దెయ్యాన్ని పట్టుకోవడానికి పోలీసును పిలవడం ఏంటి రాజా