పోర్న్ ఫిల్మ్ లో, సెమీ పోర్న్ ఫిల్మ్ లో కానీ.. ఓటీటీ యాప్స్ ద్వారా నీలిచిత్రాలను విడుదల చేసిన వ్యవహారంలో అరెస్టైన వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు సంబంధించి రకరకాల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్ సినిమాలను రూపొందించి, వాటిని యాప్స్ ద్వారా విడుదల చేయడం ద్వారా కుంద్రా రోజుకు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకూ సంపాదించాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.
ఈ లెక్కన నెలకు రెండు కోట్ల రూపాయల వరకూ కుంద్రా సంపాదించాడనేది పోలీసులు మోపిన అభియోగాల సారాంశం. దాదాపు ఏడాదిన్నర పై నుంచినే కుంద్రా ఈ తరహా వ్యాపారం చేశాడంటూ పోలీసులు చెబుతున్నారిప్పుడు.
ఇక ఈ వ్యవహారంలోనే కుంద్రా మహిళా మోడల్స్ ను బ్లాక్ మెయిల్ చేశాడు, వేధించాడు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరిని బలవంతంగా ఈ రొంపిలోకి దించారనే వార్తలూ వస్తున్నాయి. వాస్తవానికి పోర్న్ వల్ల ఉన్న అతి పెద్ద ప్రమాదాల్లో వుమెన్ ట్రాఫికింగ్ ఒకటి.
ఒక్కసారి ఈ వ్యాపారంలోకి దిగిన వారు ఇలాంటి వాటిని సులువుగా చేయగలరేమో. తమను బెదిరించి ఈ వ్యాపారంలోకి దించారని లేడీ ఆర్టిస్టులు ఇప్పుడు కుంద్రాపై కంప్లైంట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అలాంటివి జరిగాయా లేదా అనేది పోలీసులు తేల్చాలి.
ఆ సంగతలా ఉంటే.. కొందరు సెమీ సెలబ్రిటీలతో కూడా ఈ తరహా సినిమాలు చేయాలని కుంద్రా ప్రయత్నాలు చేశాడట. ప్రత్యేకించి బిగ్ బాస్ వంటి షోతో పాపులర్ అయిన వారిపై కుంద్రా కన్నేశాడట. అందుకోసం వారితో సంప్రదింపులు కూడా జరిగాయట. అయితే ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ తన పారితోషకం ఐదు లక్షల రూపాయలు అడిగిందట. తను అంత ఇవ్వలేనంటూ కుంద్రా వెనక్కు తగ్గినట్టుగా వార్తలు వస్తున్నాయి.