వైఎస్సార్ చలువతోనే తెలుగుకు ప్రాచీన హోదా

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందని అధికార భాషా సంఘం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాకనే ఏపీలో అధికార…

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందని అధికార భాషా సంఘం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాకనే ఏపీలో అధికార భాషా సంఘంతో పాటు అనేక తెలుగు సంస్థలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.  

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలుగు విధిగా అమలు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక జీవో జారీ చేయడం జరిగిందని, ఎక్కడైనా తెలుగును అమలు చేయకపొతే అయితే ప్రతి ఒక్కరు కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందని యార్లగడ్డ చెప్పుకొచ్చారు.

ఇక మీదట ఏపీలో ఆహ్వాన పత్రాలు, శిలా ఫలకాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు అధికారుల అదేశాలు, ప్రజలు కోసం జారీ చేసే ప్రకటనలు ఇలా అన్నీ కూడా తెలుగు లోనే అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు అమలు చేయాలని లేకపోతే చర్యర్లు కూడా ఉంటాయని హెచ్చరించారు.

ఏపీలో తెలుగు భాష ఇంతలా అపహాస్యం కావడానికి కార్పోరేట్ విద్యా సంస్థలే కారణం అని ఆయన ఆరోపించారు.. కార్పోరేట్ విద్యా సంస్థలు వారి పాఠశాలలు, కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని అమలు చేస్తున్నారని అది ఎంత మాత్రం సరికాదన్నారు. అంతేకాకుండా ఆంగ్ల విద్యా బోధన కోసం కట్టిన విద్యార్థుల ఫీజులతో ఇష్టారాజ్యంగా ప్రకటనలు ఇస్తూ పరోక్షంగా ప్రజలను, విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారని యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.