మాస్ బాట పట్టిన కిరణ్ అబ్బవరం

నేను మీకు బాగా కావాల్సినవాడిని…ఇలాంటి లెంగ్తీ టైటిల్ తో వస్తున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఒకప్పటి శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత. మరో వారంలో థియేటర్లలోకి రాబోతున్న…

నేను మీకు బాగా కావాల్సినవాడిని…ఇలాంటి లెంగ్తీ టైటిల్ తో వస్తున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఒకప్పటి శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత. మరో వారంలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేసారు. 

దాదాపు అందరు యంగ్ హీరోలకు మాస్ బాట పట్టాలని చాలా అంటే చాలా కోరికగా వుంటుంది. ఈ సినిమా కూడా అదే లెక్కలో కనిపిస్తోంది. పంచ్ డైలాగులు, ఫైట్లు, లుంగీ మీదకు కట్టి పాటలు, డ్యాన్స్ లు, ఇలా సింగిల్ థియేటర్ ఆడియన్స్ ను అలరించడానికి కావాల్సిన అన్ని హంగులు యాడ్ చేసినట్లు కనిపిస్తోంది.

కథ మరీ కొత్తగా వున్నట్లు ట్రయిలర్ అయితే వెల్లడించలేదు. పెద్దలు ఒప్పుకోని ప్రేమ, దాని పర్యవసానాలు, వీటి మధ్యలో మిక్స్ చేసిన హీరో మాస్ ఎలిమెంట్లు ట్రయిలర్ లో పరుచుకున్నాయి. సాఫ్ట్ వేర్ అమ్మాయిల ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా కథలో మిక్స్ చేసినట్లున్నారు. మొత్తం మీద చూస్తుంటే పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా, ఓ ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్ అందించాలనే ఆలోచనతో దర్శకుడు శ్రీధర్ సినిమా తీసినట్లుంది.

హీరో కిరణ్ కు పక్కన బాబా మాస్టర్ ను పెట్టడం ద్వారా మరింత మాస్ ఎలిమెంట్ పెంచే ప్రయత్నం చేసారు. టోటల్ గా చూసుకుంటే యూత్ ఫుల్ మాస్ సినిమా అందించే ప్రయత్నం చేసింది టీమ్ అని తెలుస్తోంది. కిరణ్ తో పాటు సంజన ఆనంద్, సోను తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం మణిశర్మ.