పవన్ చేతుల మీదుగా ట్రయిలర్

కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సిద్దార్థ్ద్‌ మీనన్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌, సోను ఠాగూర్‌, భరత్‌ రొంగలి నటీనటులుగా దర్శకుడు శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో కోడి…

కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సిద్దార్థ్ద్‌ మీనన్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌, సోను ఠాగూర్‌, భరత్‌ రొంగలి నటీనటులుగా దర్శకుడు శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ చిత్రం ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

నిర్మాత కోడి దివ్య దీప్తి మాట్లాడుతూ… పవన్‌ కల్యాణ్‌ ట్రైలర్‌ లాంచ్‌ చేసి, మా అందరికీ బ్లెస్సింగ్స్‌ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఔట్‌పుట్‌ విషయంలో యూనిట్‌ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇన్నిరోజుల మా కష్టానికి ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుందనే అందరం హోప్‌తో ఉన్నాం. బిజినెస్‌ కూడా చాలా బాగా జరిగింది. ప్రేక్షకుల ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు.

హీరో కిరణ్‌ అబ్బవరపు మాట్లాడుతూ… అన్ని చోట్ల నుంచి ట్రైలర్‌ చాలా బాగుంది అనే టాక్‌ వస్తోంది. పవన్‌ సార్‌ను ఇంతకు ముందు కలిసే అవకాశం వచ్చినప్పటికీ, ఏదైనా మంచి పెద్ద విషయం ఉంటే కలవాలని ఆగాము. ఇప్పుడు కలిశాము. చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఆయన సినిమాలకు చొక్కాలు చించుకుని థియేటర్స్‌లో సందడి చేశా. ఇవాళ ఆయన నేను నటించిన సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడం అంటే ఇట్స్‌ ఎ వెరీ స్పెషల్‌ డే టు మి. ఈసారి మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాం. ఇది కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అలాగే అండర్‌ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం విత్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో. తప్పకుండా అందరూ కుటుంబంతో సహా థియేటర్స్‌లో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చూడండి అన్నారు.

దర్శకుడు శ్రీధర్‌ గాదె మాట్లాడుతూ… పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు థియేటర్స్‌లో అల్లరి చేసిన వ్యక్తులం మేము. అలాంటిది మేము చేసిన సినిమా ట్రైలర్‌ పవన్‌ గారి చేతుల మీద విడుదలవ్వడం రియల్లీ ఎగ్టైటింగ్‌గా, ఆనందంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌. ట్రైలర్‌లో చూపించిన దానికంటే మరింత అద్భుతంగా ఉంటుంది సినిమా 16వ తేదీన విడుదలౌతోంది అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని దీవించండి అన్నారు.

హీరోయిన్‌ సంజన ఆనంద్‌ సినిమాటోగ్రాఫర్‌ రాజ్‌ కె. నల్లి తదితరులు ప్రసంగించారు.