ఆర్‌కే రోజా…ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. “నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక” అంటూ వయ్యారాలు పోతూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. తాను ఎంచుకున్న రంగంలో రాణించేందుకు ఎంతో అంకిత భావంతో పనిచేయడం రోజాకు మొదటి నుంచి అలవాటు. మొదట టీడీపీలో రాజకీయ ప్రస్తానాన్ని ఆమె ప్రారంభించారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా సమర్థవంతమైన పాత్ర పోషించారు. అయితే ఆ పార్టీలో వెన్నుపోటు రాజకీయాలతో ఆమె నగరి నుంచి ఓటమిపాలయ్యారు.
అనంతర రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ వైపు మొగ్గారు. దివంగత వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్‌తో కలిసి నడక మొదలు పెట్టారు. వైసీపీ తరపున రెండుసార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అడపాదడపా బుల్లితెరపై కనిపిస్తుం టారు. రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రోజా ఏం చేసినా సంచలనమే. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో వంటలు చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడితే దాదాపు 20 లక్షల మంది చూశారు. అదీ రోజా రేంజ్.
తాజాగా ఆమె తన ఇంట్లో ఎక్సర్‌సైజ్‌కు సంబంధించి వీడియో షేర్ చేశారు. డంబెల్స్‌తో సునాయాసంగా ఎక్సర్‌సైజ్ చేస్తూ చెమట చిందిస్తున్నారు. ఎలాంటి అలసట లేకుండా , వేగంగా డంబెల్స్‌తో ఆమె ఎక్సర్‌సైజ్ చేయడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
మోచేతులపై శరీరాన్ని మొత్తం తిప్పుతూ ఒక్క నిమిషం పాటు అలాగే ఉన్న రోజా.. “వన్ మినిట్ ప్లాంక్ ఛాలెంజ్ నేను చేశా. మరి మీరు” అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి సవాల్ విసిరారు. కొందరు అభిమానులు రోజా సవాల్‌ను స్వీకరించి ఫాలో అవుతూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు . మొత్తానికి ఏదో ఒక ప్రత్యేకత చాటుకోవడం రోజాకే సాధ్యం. అందుకే ఆమెకు ప్రత్యేక గుర్తింపు.