యాభై శాతం అటెండెన్స్‌తో సినిమా థియేటర్లు రన్ చేయడానికి పర్మిషన్ కావాలంటూ మల్టీప్లెక్స్ ఛెయిన్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాయి.
ఒక సీటు వదిలి ఒక సీటు అమ్మేలా, ఒకే కుబుంబమయితే ఒక చోట కూర్చునే అవకాశమిచ్చేలా, అలాగే కెఫెటేరియా, బాత్రూమ్‌ల వద్ద ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ఒక కార్యాచరణ చిట్టా సిద్ధం చేసి ప్రభుత్వం ముందు వుంచాయి.
అయితే ఇది ఆచరణ సాధ్యం కాదనేది ఎవరైనా ఇట్టే చెప్పవచ్చు. ఓపెన్ స్పేస్‌లోనే వైరస్ వ్యాపిస్తోంటే ఏసీ రన్ అయ్యే క్లోజ్‌డ్ స్పేస్‌లో దాని ప్రభావాన్ని నియంత్రించడం సాధ్యమా? ఒక సీటు దూరమున్నంత మాత్రాన కరోనా బాధితుడు హాల్లో వుంటే వ్యాప్తి కాకుండా నిరోధించడం వీలవుతుందా? అలాగే బాత్రూమ్‌ల వద్ద, క్యాంటీన్ల వద్ద ఫిజికల్ డిస్టెన్సింగ్ వీలయ్యే పనేనా?
ఇవన్నీ ఆచరణ సాధ్యం కాకపోయినా కానీ ఇష్టమున్న వాళ్లే థియేటర్లకి వస్తారనే ఆలోచనతో సినిమా థియేటర్లకి పర్మిషన్ త్వరలోనే ఇస్తారని అంచనా.
జూన్ నుంచి పర్మిషన్ దొరుకుతుందనే నమ్మకం వలనే తెలుగు సినిమా నిర్మాతలు డిజిటల్ రిలీజ్ గురించిన సంప్రదింపులు కూడా మానేసారట. ముందుగా చిన్న సినిమాలు విడుదల చేసి, పరిస్థితిని బేరీజు వేసుకుని పెద్ద బడ్జెట్ సినిమాలని షెడ్యూల్ చేస్తారట.