2020 సంక్రాంతికి ఈసారి గట్టి పోటీ వుంటుందని, నాలుగైదు సినిమాలు విడుదలవుతాయని ఇన్నాళ్లూ వినిపిస్తోంది. అయితే వీటిల్లో ఓ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లే. నాగ్-రమ్యకృష్ణ, నాగచైతన్య కాంబినేషన్ లో ప్లాన్ చేసిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి రావడంలేదు.
ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. మన్మధుడు 2 తరువాత స్టార్ట్ చేసి సంక్రాంతికి విడుదల చేస్తారని ఇన్నాళ్లు వినిపించింది. కానీ ఈ సినిమాను సంక్రాంతికి కాక, వచ్చే సమ్మర్ కు రెడీ చేయాలని నాగార్జున డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈనెల నుంచి మూడునెలల పాటు నాగార్జున బిగ్ బాస్ 3లో బిజీగా వుంటారు. అలాగే నాగచైతన్య వెంకీమామ, ఆ తరువాత శేఖర్ కమ్ముల సినిమాల మీద వుంటారు. అదీకాక సంక్రాంతికి మహేష్, బన్నీ, రజనీ సినిమాలు పక్కాగా వున్నాయి. అందుకే అన్ని విధాలా ఆలోచించి, బంగార్రాజు సినిమాను సమ్మర్ కు తీసుకెళ్లాలని నాగ్ డిసైడ్ అయినట్ల బోగట్టా.
అంటే లేట్ గా స్టార్ట్ అయి, లేటుగా విడుదలవుతుంది అన్నమాట. ఈ సినిమాకు నాగ్ ఫ్యామిలీకి రెండు హిట్ లు ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకుడు.