ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో మంత్రులు చెలరేగిపోతున్నారు. ఒక్కొక్కరుగా ప్రెస్మీట్లు పెడుతూ చంద్రబాబు, లోకేశ్‌లపై రెచ్చిపోతున్నారు. కావలి పర్యటనలో తనపై లోకేశ్ అవాకులు చెవాకులు పేలడంతో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఫేక్ నా కొడుకులని నారా లోకేశ్ మాట్లాడ్డంపై కాకాణి ఫైర్ అయ్యారు.
నెల్లూరు నేర రాజధానిగా మారడానికి ప్రధాన కారణం కాకాణి గోవర్ధన్‌రెడ్డి అని లోకేశ్ విమర్శించారు. అలాగే కండీషన్ బెయిల్‌పై తిరుగుతున్న కాకాణి అరాచకాలు అన్నీఇన్నీ కావన్నారు. నెల్లూరులో ఏడుగురు రైతులకు చెందిన 4.70 ఎకరాల భూమిని కాకాణి ఆక్రమించారన్నారు. ఆరుగురు విశ్రాంత ఉద్యోగుల భూమి కబ్జా చేశారని ఆరోపించారు. పోర్జరీ సంతకాల కేసు, కల్తీ మద్యం కేసులకు మంత్రి కాకాణి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని లోకేశ్ విమర్శించారు.
కాకాణి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఓ మహిళను మోసగించారని కాకాణి సంచలన ఆరోపణ చేశారు. చంద్రబాబునాయుడు కుటుంబానికి నీచమైన చరిత్ర వుందని ఆరోపించారు. చంద్రబాబు ఏపీలో పుట్టడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న శాపమన్నారు. అసలు లోకేశ్ ఎవడు? అని ఆయన ప్రశ్నించారు. జనాల్లో గెలిచాడా? ప్రజాదరణ ఉన్న నాయకుడా? ఉద్యమాలు చేసినవాడా? అని నిలదీశారు.
నెత్తి మీద రూపాయి పెడితే పావులా కూడా విలువ చేయని వ్యక్తి చేసే విమర్శలపై స్పందించాల్సి రావడం అవమానకరంగా భావిస్తున్నట్టు కాకాణి తెలిపారు. లోకేశ్ ఫేక్ నా కొడుకులు అని మాట్లాడారని, ఎలాంటి సంస్కారాన్ని చంద్రబాబు నేర్పారో తెలుసుకోవాలన్నారు. ఫేక్ నా కొడుకులెవరో ఈ సమాజానికి, రాష్ట్రానికి తెలుసన్నారు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్ట్రేషన్‌లో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అఖిల భారత దరిద్ర సంఘానికి ప్రాతినిథ్యం వహించాల్సిందే తప్ప రాజకీయ పార్టీలకు కాదన్నారు. చంద్రబాబునాయుడి గురించి మాట్లాడాల్సి వస్తే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి అన్నారు.
చంద్రబాబునాయుడి నాయన ఖర్జూరనాయుడు రాత్రి వేళ అందరూ నిద్రపోయిన తర్వాత పొలాల్లోని వేరుశనగ బస్తాలను ఎత్తుకెళ్లేవాడన్నారు. ఔనా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు ఆస్తిపాస్తులెన్నో చెప్పాలని కోరారు. అలాగే చెప్పకూడదు కానీ, అడిగారు కాబట్టి చంద్రబాబు గురించి ఒక విషయం చెప్పాల్సి వస్తోందంటూ కాకాణి సంచలన ఆరోపణ చేశారు.
చేపలు అమ్ముకునే అమ్మాయిని మోసం చేసి, డబ్బులు లాక్కుని, చదువుకుని, ఆ తర్వాత ఎన్టీఆర్ కూతురిని పెళ్లి చేసుకున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. చివరికి ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుటుంబానికి ఉన్న విశ్వసనీయత, వ్యక్తిత్వం ఏంటో ఎవరిని అడిగినా చెబుతారన్నారు.
చంద్రబాబునాయుడు పిక్ ప్యాకెట్లు కొట్టుకునే వాడా? కాదా? అని ఎవరిని అడిగినా చెబుతారని తప్పు పట్టారు. కావున లోకేశ్ తనది, తన తండ్రి, తాత పరిస్థితి ఏంటి తెలుసుకోవాలని హితవు చెప్పారు. ఏమీ తెలుసుకోకుండా ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడ్డం సంప్రదాయం, పద్ధతి కాదన్నారు. కావున చంద్రబాబు కూడా తన కొడుకుని జాగ్రత్త చేసుకోవాలని హితవు చెప్పారు.