మరోసారి తెలంగాణ గవర్నర్ తమిళ సై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ గరర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తమిళ సై మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన నేను భయపడలేదని, గౌరవం ఇవ్వకున్నా ప్రజల కొసం పని చేస్తునే ఉంటానని ఎక్కడ తగ్గేదే లేదన్నారు. నన్ను గౌరవించకపోయినా పర్వలేదు కానీ కనీసం రాజ్ భవన్ ను అయిన గౌరవించాలన్నారు. రాజ్ భవన్ ఇప్పుడు ప్రజా భవన్ గా మారిందన్నారు.
రాష్ట్రాంలో ఎక్కడ పర్యటించిన అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, నాతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులు ఎంటో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వని డిమాండ్ చేశారు. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగితే స్పందించలేదని, 8 గంటలు రోడ్డు మార్గంలో ప్రయాణించి జాతరకు వెళ్లానన్నారు.
సదరన్ జోనల్ సమావేశానికి సీఎం ఎందుకు వెళ్లలేదని, రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి మంచి ఆవకాశం వస్తే సీఎం సద్వినియోగం చేసుకోలేదన్నారు. సీఎంకు వచ్చిన సమస్య ఏంటో చెప్పాలనన్నారు. మొత్తానికి ఇకపై బెంగాల్ తరహా రాజకీయం తెలంగాణలో కూడా నడవబోతున్నట్లు కనపడుతోంది. ఇవాళ గవర్నర్ మాటలు చూస్తుంటే. గవర్నర్ ఒక మాట అంటే కేసీఆర్ పది మాటలు అంటారని ముందే తెలిసి గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతోంది.