మొన్నటి వరకు ఏపీ రాజకీయాలల్లో ఉన్న సిని నటి దివ్యవాణి, ఇవాళ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేంద్రను కలిశారు. శామిర్ పేటలోని ఈటల నివాసనికి వెళ్లి భేటి అయ్యారు.
గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి నిత్యం వైసీపీ మీద విమర్శలు కురింపించే దివ్యవాణి, టీడీపీ నన్ను మోసం చేసిందని టీడీపీలో ఒక వర్గం వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటూందని ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసీ పార్టీ నుండి బయటి వచ్చేసింది.
టీడీపీ నుండి బయటకి వచ్చిన తర్వాత టీడీపీ, దాని అనుకూల మీడియా దివ్యవాణి వైసీపీ కోవర్ట్ అని అరోపిస్తూ దివ్యవాణి వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు కొన్ని రోజులు ప్రచారం చేశారు. దివ్యవాణి గత కొంత కాలంగా సైలంట్ ఉండి ఈ రోజు రాజకీయ సమావేశం అవ్వడంతో దివ్యవాణి బీజేపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సమావేశం తర్వాత దివ్యవాణి మాత్రం మర్యాదపూర్వకంగానే ఈటలను కలిశానన్నారు. దివ్యవాణి బీజేపీలో చేరితే తెలంగాణలో యాక్టివ్ ఉంటారా లేక ఏపీ బీజేపీలో ఉంటారా అనేది తెలియాలి. ఏపీ బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం ఉంటే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును కలిసే వారని టాక్ వినిపిస్తుంది.