తెలుగు సినిమాలకు అవార్డులు కొత్త కాదు. గతంలో అనేక సార్లు వచ్చాయి. అయితే ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రతి ఏటా ఉత్తమ ప్రాంతీయ చిత్రం అనే అవార్డు ఎలాగూ వస్తుంది. దేనికో ఒకదానికి ఇవ్వాలి.
ఎప్పుడో కానీ దాన్ని మిస్ కొట్టరు. కానీ జాతీయ అవార్డు స్పెసిఫిక్ గా రావడం వేరు. ఇలాంటి నేపథ్యంలో 2019 సంవత్సరానికి గాను జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు.
మూడు జాతీయ స్థాయి అవార్డులు తెలుగు సినిమాలకు వచ్చాయి. మోస్ట్ పాపులర్ ఫిల్మ్ క్యాటగిరీలో మహేష్ బాబు మహర్షి సినిమా అవార్డు సాధించింది. పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. అలాగే ఇదే సినిమాకు గాను కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఉత్తమ నృత్య దర్శకుడు అవార్డు గెల్చుకున్నారు.
అలాగే నాని హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన గౌతమ్ తిన్ననూని జెర్సీ సినిమాకు ఉత్తమ ఎడిటర్ అవార్డు లభించింది. టాలీవుడ్ లో ఇప్పుడు మంచి పేరు డిమాండ్ వున్న ఎడిటర్ నవీన్ నూలి నే. ఇది కాక ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు జెర్సీకి లభించింది.
మొత్తం మీద కరోనా తరువాత టాలీవుడ్ కు అంతా పాజిటివ్ గా వుంది. మంచి హిట్ లు పడుతున్నాయి. అవార్డులు వస్తున్నాయి. పలు పాన్ ఇండియా సినిమాలు మేకింగ్ లో వున్నాయి.