తెలుగుదేశం పార్టీ, పచ్చ మాఫియా (అంటే పచ్చ అనుకుల మీడియా, పచ్చ మేధావులు, పచ్చ సోషల్ మీడియా) ఆత్మపరిశీలన చేసుకోకపోతే ఆంధ్రా రాష్ట్రానికి చేటు జరుగుతుందనిపిస్తోంది. నిర్ణయాత్మకశక్తిగా అధికార పక్షం ప్రశ్నించేదిగా ప్రతిపక్షం ఉండటం ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.
ఈ బ్యాలన్స్ తప్పితే? 2019 ఎన్నికలలో 6/7 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు, మొన్న జరిగిన పంచాయితీ పురపాలక ఎన్నికలలో 90 శాతం సీట్లు వైఎస్సార్సీపీ గెలవడం ప్రతిపక్షాలు నిర్వీర్యమవడం రాష్ట్రానికి చేటు చేసేదే.
ఎందుకిలా జరుగుతోంది?
చంద్రబాబు తప్పులు మొదట. మొదటిది ప్రజాస్వామ్య విలువలు ఏ మాత్రం లేకుండా ఏ అర్హత, సామర్థ్యం లేని కొడుకుని ప్రజలపైన, పార్టీ పైన రుద్దటానికి చూసే చంద్రబాబుది మొదటి తప్పు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా పతనం అవుతున్నా స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోతున్నా పుత్రప్రేమ ముందు ధృతరాష్ట్రుడిలా అంధుడిలా నిజాలు చూడకుండా తెలుగుదేశం పార్టీకి ఆరడుగుల గొయ్యి తవ్వుతున్న చందం సంఘంలో మేధావులుగా చెలరేగిపోతున్న వారి కుల మేధావులకు కనబడకపోవడం ఒక విడ్డూరం.
చాలా మందికి లోకేశానికి ఆకారం, రాజకీయ ప్రసంగాలు ఇవ్వడం చేతకాకపోవడం వలననే ఇబ్బంది అనుకుంటారు. కానీ నిజం మాత్రం రాజకీయ ఆపరిపక్వత, అందినకాడికి దోచుకోవడం, తను కానిదాన్ని ప్రజలను నమ్మించాలని చూడటం. జగన్ 2009 ప్రసంగాలను చూసి ఆయనకు ప్రజలు మద్దతు ఇవ్వలేదు, తన పోరాట పటిమను చూసి మాత్రమే. వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా తన ఔట్ సైడ్ ద బాక్స్ ఆలోచనల వలననే ఈ పన్నెండేళ్లలో ఆయన సాధించిన విజయాలు సాధ్యమయ్యాయి.
అంతేగానీ, తన ఊదరకొట్టే ప్రసంగాల వల్ల కాదు. దేనికైనా ఎదురొడ్డి పోరాడే గుణం, రెయ్యంబగుల్లు కష్టపడే తత్వం, నమ్మినవాల్లను కనిపెట్టుకునే విధానం, ప్రజలను కంట్లో పెట్టుకుని వాళ్ళ బాగోగులను చూసుకునే మనస్సు ఆయన స్వంతం. ఇవేమీ లేని కొడుకుని పార్టీ నాయకుడిని చేయగలడేమో గానీ ప్రజానాయకుడిని చెయ్యలేడు చంద్రబాబు.
యువ రక్తమంటే నాయకుల కొడుకులు కూతుర్లే కాదు సమాజంలోని అందరూ అని నమ్మిన జగన్ బీద బిక్కీ వర్గాలకు రాజ్యాధికారం ఇస్తుంటే చంద్రబాబు తన కొడుక్కి, నాయకుల కొడుకులకు కూతుర్లకు సీట్లిచ్చి తప్పు చేస్తున్నాడు. రెండోది జగన్, ప్రభుత్వం ఏది చేసినా చంద్రబాబు తప్పుపట్టడం. ప్రజలకు మంచి జరిగే పనులనూ అమలు కాకుండా కోర్టుల్లో తనకున్న శక్తిని వాడుకోవడం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం చేశాయి. ఇంగ్లీష్ మీడియం విద్య, పేదలకు ఇళ్ల స్థలాలు మచ్చుకి కొన్ని ఉదాహరణలు.
చంద్రబాబు మనవడు, లోకేష్ కుమారుడు ఎకరం భూమిలో 200 కోట్ల ఇల్లు కట్టుకుని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, జపనీస్ స్పానిష్ జర్మన్ నేర్చుకోవచ్చు కానీ మా పిల్లలు మాత్రం పూరి గుడిసెల్లో ఉండి ప్రభుత్వ పాటశాలలో తెలుగు మీడియం మాత్రమే చదవాలా అని కసిరేగితే ఆ తప్పు ఎవరిది? విజయవాడ తన కుల రమేష్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో చంద్రబాబు ప్రవర్తన, కోర్టుల ద్వారా విచారణ కూడా ఆపడం ప్రజలలో చంద్రబాబన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా ఏహ్యభావం కలుగజేసింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
ఇన్ని జరుగుతున్నా, తెలుగుదేశ అనుకుల పచ్చ మాఫియా మీడియా మాత్రం ఇవేమీ ప్రజలకు తెలియవనుకుని మహా మేధావులు మహానేతలు రూపాయ విలువ చేయని సబ్బం హరి, హర్ష కుమార్, నర్సాపురం రాజు గారు శివాజీ, పట్టాభి, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, లగడపాటి రాజగోపాల్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారిని పెట్టుకుని రోజంతా పొలిటికల్ డిస్కషన్స్ చేసి వీళ్ళు చెపితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారని అనుకోవడం ఎంత అమాయకత్వమో నిజంగా హాస్యాస్పదం.
వేమూరి రాధాకృష్ణ, రామోజీ రావులు ఏమి చెప్తే దానికి పూర్తి విరుద్ధంగా ప్రజలు నమ్ముతారని ఇంకా తెలుగుదేశం తెలుసుకోకపోవడం కడు విచిత్రం. 2014కు ముందు పచ్చ సోషల్ మీడియా చేసిన ప్రచారాలు కొంతమేరకు పనిచేశాయి కానీ ఆ తర్వాత పనిచేయలేదనేది ఇక ముందు కూడా పనిచేయవనేది నగ్న సత్యం.
జగన్ ప్రభుత్వానికి అసలు సిసలు ప్రత్యర్థి మాత్రం చంద్రబాబు పాలు పోసి పెంచిన వ్యవస్థలే కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కాదనేది నిర్వివాదాంశం. ఈ వ్యవస్థలే జగన్ ప్రభుత్వానికి పెనుముప్పుగా పనిచేస్తూ ఎప్పుడూ కనురెప్పలు మూయకుండా చేస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పటికైనా చంద్రబాబు, తెలుగుదేశం, అనుకుల పచ్చ మాఫియా మీడియా, పచ్చ సోషల్ మీడియా తమ తప్పులను గ్రహించి జగన్, ప్రభుత్వం, వైఎస్సార్సీపీ చేసే మంచి పనులను గుర్తించి గౌరవించడం సమర్ధించడం, తప్పులను ఎత్తిచూపి లోపాలను సవరించుకునే అవకాశం ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి వారిని ఫ్యాక్షనిస్టని ఇంకోటని తూలనాడటం మాని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవించడం లాంటి చిన్న చిన్న పనులు చేయడం, తమ పార్టీలో జరిగే లోపాలను సవరించుకోవడం ప్రారంభించాలి.
రాష్ట్రానికి ప్రజలకు మంచి జరిగే ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి నిర్ద్వందంగా భేషరతుగా మద్దతిచ్చి ప్రజలలో నమ్మకం తెచ్చుకుంటే వైఎస్సార్సీపీనీ, జగన్మోహన్ రెడ్డి గారినీ ఎదిరించి ప్రతిపక్షంగా నిలబడుతుంది తెలుగుదేశం. లేకపోతే, చరిత్ర పుటల్లో మిగిలి కనుమరుగు అవుతుంది.
ఆత్మ పరిశీలన మాత్రం తప్పదు!!
గురవా రెడ్డి, అట్లాంటా