విశాఖలో ‘కృష్ణ …. విహారి’

నాగశౌర్య అప్ కమింగ్ సినిమా కృష్ణ వృింద విహారి. అనీష్ కృష్ణ డైరక్షన్ లో తయారైన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకు రెడీ అవుతోంది.  Advertisement ఇప్పటికే పాటలు, మేకింగ్ వీడియోలు…

నాగశౌర్య అప్ కమింగ్ సినిమా కృష్ణ వృింద విహారి. అనీష్ కృష్ణ డైరక్షన్ లో తయారైన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకు రెడీ అవుతోంది. 

ఇప్పటికే పాటలు, మేకింగ్ వీడియోలు విడుదల చేసారు. వెన్నెల్లో వర్షంలా సాంగ్ పెద్ద హిట్ అయింది. ఆ పాట వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు సినిమా ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ నెల 10న ట్రయిలర్ ను విడుదల చేస్తారు.

విశాఖ బీచ్ లో జ‌రిగే మాంచి యూత్ ఫుల్ ఫంక్షన్ లో ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న భిన్నాభిప్రాయాలున్న యంగ్ కపుల్ మధ్య నడిచే కథ ఇది. అటు సంప్రదాయ కుటుంబం, ఇటు ఆధునికభావాలున్న అమ్మాయి, మధ్యలో నలిగే కుర్రాడిగా శౌర్య కనిపించబోతున్నాడు.

సినిమా ట్రయిలర్ ఫంక్షన్ కు విశాఖకు చెందిన రాజ‌కీయ, పౌర ప్రముఖులు పాల్గొంటారు. తరువాత విడుదల దగ్గర చేసి హైదరాబాద్ లో సినిమా ప్రముఖులతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంటుంది. ఈ సినిమాకు సంగీతం మహతి స్వరసాగర. నిర్మాత ఉష మాల్పూరి.