భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై అన్ని రకాల క్రికెట్ ఫార్మట్స్ నుండి తప్పుకోనున్నట్లు ట్వీటర్ వేదికగా ప్రకటించారు.
సురేశ్ రైనా ట్వీట్లో ఇలా వ్రాశాడు, “నా దేశం, నా రాష్ట్రమైన యుపికి ప్రాతినిధ్యం వహించడం ఒక సంపూర్ణ గౌరవం. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి నా రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నాను. బీసీసీఐ, క్రికెట్ అసోసియేషన్, సీఎస్కే మరియు నా అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీటర్ లో పేర్కొన్నాడు.
2020లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సురేష్ రైనా ఐపీఎల్ లో మాత్రం ఆటను కొనసాగుతూ వచ్చారు. కానీ గత ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా రైనా మిగిలిపోయాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో రైనా 226 వన్డేలు ఆడి 5,615 పరుగులు, 18 టెస్ట్ క్రికెట్ లో 768 పరుగులు, అలాగే 78 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 1, 605 రన్స్ చేశాడు. ఐపిఎల్ మెగా టోర్నీలో మొత్తం 205 మ్యాచ్లు ఆడిన రైనా.. 5,528 పరుగులు సాధించాడు.