బుద్ధిలేని లోకేష్ కు గడ్డిపెట్టిన నెటిజన్లు

తనని తాను పెద్ద మేధావిగా ఊహించుకోవడం నారా లోకేష్ కి బాగా అలవాటు. అందుకే ఓ టీమ్ ని పెట్టుకుని మరీ ట్విట్టర్ అకౌంట్ మెయింటెన్ చేస్తుంటారు, ప్రభుత్వాన్ని చెడామడా తిడుతుంటారు. అయితే లోకేష్…

తనని తాను పెద్ద మేధావిగా ఊహించుకోవడం నారా లోకేష్ కి బాగా అలవాటు. అందుకే ఓ టీమ్ ని పెట్టుకుని మరీ ట్విట్టర్ అకౌంట్ మెయింటెన్ చేస్తుంటారు, ప్రభుత్వాన్ని చెడామడా తిడుతుంటారు. అయితే లోకేష్ ట్వీట్లలో దాదాపు 90శాతం లాజిక్ కి అందవు. ఎక్కడో ఏదో ఉదాహరణను తీసుకుని ప్రభుత్వాన్ని విమర్శించడం ఆయనకు అలవాటే. తాజాగా ఇలాంటి ఓ ట్వీట్ లోకేష్ కి తిప్పలు కొనితెచ్చింది.

విశాఖ జిల్లా నాతవరం మండలంలో ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ ని డీఈఓ సస్పెండ్ చేసిన అంశాన్ని లోకేష్ హైలెట్ చేయాలనుకున్నారు. టీచర్ ని సస్పెండ్ చేయడం అన్యాయం అంటూ పేపర్ కటింగ్ పెట్టి మరీ రెచ్చిపోయారు. ఎవరో పంపిన మెసేజ్ ని సదరు టీచర్ ఫార్వర్డ్ చేశాడని, దానికి అన్యాయంగా ఆయన్ను సస్పెండ్ చేశారని లోకేష్ వరుస ట్వీట్లు వేశారు.

అంతవరకు బాగానే ఉంది, విమర్శలు చేసి చేతులు దులుపుకున్నాం అనుకుని మరో సబ్జెక్ట్ కి వెళ్లిపోయారు చినబాబు. అయితే నెటిజన్లు మాత్రం లోకేష్ కి బాగానే బుద్ధి చెప్పారు. టన్నులు టన్నులుగా గడ్డి పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల సర్వీస్ రూల్స్ ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టి మరీ లోకేష్ కి జ్ఞానోదయం కల్పించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తే ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందనేది సర్వీస్ రూల్స్ లోని ప్రధాన అంశం. అంత మాత్రాన ఎవరూ ప్రభుత్వ విధానాలను సమర్థించాలని కూడా లేదు. అయితే విమర్శలనేవి ప్రభుత్వ ఉద్యోగుల విధి కాదు అని మాత్రమే ఆ రూల్ చెబుతోంది.

రూల్స్ మాట్లాడే ముందు సర్వీస్ రూల్స్ కూడా తెలుసుకోండి అంటూ నెటిజన్లు లోకేష్ పై మండిపడుతున్నారు. సస్పెండ్ అయిన టీచర్ తనకి తానే మెసేజ్ లు స్ప్రెడ్ చేస్తున్నారని, అవి ఫార్వర్డ్ మెసేజ్ లు కావని డిటెయిల్డ్ గా సీన్ ని వివరించారు. గతంలో టీడీపీ హయాంలో వైసీపీ సానుభూతి పరుల్ని ఎలా వేధించారనే విషయాలను కూడా గుర్తుకు తెచ్చి లోకేష్ ని చెడుగుడు ఆడుకున్నారు.

గతంలో మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా ఇలాగే టీడీపీ రాజకీయాలను తెరపైకి తెచ్చింది. చివరకు సదరు డాక్టర్.. గతంలో టీడీపీ టికెట్ ఆశించారనే విషయం బయటపడ్డాక, పసుపురంగు వెలుగులోకి రావడంతో సర్దుకున్నారు. ఇప్పుడు ఏ రాజకీయ ప్రయోజనం లేకుండానే ఆ టీచర్ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేశారనేది తేలాల్సి ఉంది. వాట్సప్ లో ప్రభుత్వ విధానాలను ఎందుకు తప్పుబట్టారనేది బయటకు రావాలి.

మెల్లమెల్లగా వ్యవస్థల్లో ఉన్నవారి పచ్చ ముసుగులు బయటపడుతుంటే సరికి చంద్రబాబు, లోకేష్ కి ఏం చేయాలో తెలియడంలేదు. అందుకే ఇలాంటి వారందర్నీ వెనకేసుకు వచ్చి చీవాట్లు తింటున్నారు.