శోభ‌నం రాత్రి కాదు, ప‌గ‌టి శోభ‌నమ‌ని చెప్పిన క‌త్రినా!

బాలీవుడ్ సినిమా న‌టులు కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్ షో లో త‌మ సెక్సీ అనుభ‌వాల గురించి మాట్లాడ‌టం కొత్తేమీ కాదు. అక్క‌డికి వ‌చ్చే తార‌ల‌తో సెక్స్ గురించి, శృంగార సంబంధాల గురించి చ‌ర్చ‌ను…

బాలీవుడ్ సినిమా న‌టులు కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్ షో లో త‌మ సెక్సీ అనుభ‌వాల గురించి మాట్లాడ‌టం కొత్తేమీ కాదు. అక్క‌డికి వ‌చ్చే తార‌ల‌తో సెక్స్ గురించి, శృంగార సంబంధాల గురించి చ‌ర్చ‌ను పెట్ట‌డానికి అమితోత్సాహాన్ని చూపుతూ ఉంటాడు క‌ర‌ణ్ జొహార్. అక్క‌డ‌కు ఎవ‌రొచ్చినా వారు త‌మ సెక్సువ‌ల్ లైఫ్ గురించి చెప్ప‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌ను క‌ల్పిస్తూ ఉంటాడు క‌ర‌ణ్‌. 

ఇలాంటి నేప‌థ్యంలో క‌ర‌ణ్ వ‌ద్ద త‌మ సెక్సువ‌ల్ ఇంట్ర‌స్ట్ ల గురించి చాలా మంది తార‌లు చెబుతూనే ఉంటారు. అలాంటివి ఒక్కోసారి బాగా వైర‌ల్ గా మారుతూ ఉంటాయి కూడా!

ఆ మ‌ధ్య అలియా భ‌ట్ ఈ షోకు హాజ‌రు కాగా.. క‌ర‌ణ్ జొహార్ ఆమె ఫ‌స్ట్ నైట్ అనుభవం గురించి అడిగాడు. దీనిపై అలియా స్పందిస్తూ.. పెళ్లి రోజు బాగా అల‌స‌ట‌తో ప్ర‌త్యేకంగా ఫ‌స్ట్ నైట్ గురించి ఆలోచించే తీరిక కానీ, ఫ‌స్ట్ నైట్ అనుభ‌వం పొంద‌డం గురించి ఉత్సాహం ఉండ‌ద‌న్న‌ట్టుగా అలియా చెప్పింది.

వాస్త‌వానికి అలియా చెప్పింది చాలా మంది సెక్సాలజిస్టులు కూడా చెప్పేదే. పెళ్లిపై ఉత్సాహం ఉన్న వారు కూడా ఫ‌స్ట్ నైట్ పై భారీ ఎక్స్ పెక్టేష‌న్లు పెట్టుకోవ‌ద్ద‌ని.. మ‌న పెళ్లి వేడుక‌ల్లోనే వ‌ధూవ‌రులు బాగా అల‌సిపోతార‌ని, కాబ‌ట్టి ఫ‌స్ట్ నైట్ పై భారీ అంచ‌నాలు వ‌ద్ద‌ని సెక్సాల‌జిస్టులు చెబుతూ ఉంటారు. అలియా కూడా అలాగే చెప్పింది.

ఇక కొంత‌కాలం కింద‌టే పెళ్లి చేసుకుని, ఫ‌స్ట్ నైట్ మ‌ధురానుభూతిని ఫ్రెష్ గానే క‌లిగి ఉండే అవ‌కాశం ఉన్న క‌త్రినా కైఫ్ ను కూడా ఇదే అంశంపై అడిగాడు క‌ర‌ణ్. దీనిపై ఆమె కాస్త వెరైటీగా స‌మాధానం చెప్పింది. త‌మ‌ది సుహాగ్ రాత్ కాద‌ని, సుహాగ్ డే అని క‌త్రినా స‌ర‌దాగా చెప్పింది.