మనిషి అన్నాక సుఖాలూ వుంటాయి..కష్టాలు వుంటాయి. సినిమా జనాలు కూడా మనుషులేగా. ఎంత డబ్బు వున్నా తగ్గని జబ్బులు కూడా అల్లరి పెడుతుంటాయి.
కొందరు హీరోలు నడుం నొప్పితో బాధపడుతుంటారు. మరి కొందరు తరచు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ వుంటారు. ఇది కామన్. అలాగే ఓ పాపులర్, టాప్ హీరోయిన్ కు కూడా సమస్య వుంది. అది స్కిన్ డిసీజ్. గతంలో ఓసారి వచ్చింది. ఎంతకూ తగ్గలేదు. మందులు, మాకులతో పాటు పూజలు హొమాలు కూడా చేసారు. మొత్తానికి సెట్ అయింది.
అంతా బాగానే వుంది అనుకుంటే మళ్లీ ఇప్పుడు స్టార్ట్ అయింది అదే డిసీజ్. దాంతో ఇప్పుడు అనుభవం పండిన డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని బోగట్టా. దీని వల్ల ఆమె చేతిలో వున్న సినిమాలు కాస్తా ఆలస్యం అయ్యే ప్రమాదం కనిపిస్తోందట.
ప్రస్తుతానికి అయితే చేస్తున్న సినిమా షెడ్యూలు ఆపి పది రోజుల వెనక్కు తోసారు. ఆ వేళకు కాస్త తగ్గితే షూటింగ్ వుంటుంది. లేదూ అంటే మశ్లీ వాయిదా పడుతుంది.
అయినా పాపం, సినిమాలో స్నానం సీన్ వున్నా కూడా మినరల్ వాటర్ అడుగుతారు హీరో హీరోయిన్లు అని టాక్ వుండనే వుంది. అంతలా జాగ్రత్తలు తీసుకునే వాళ్లకి ఇలా స్కిన్ డిసీజ్ రావడం ఏమిటో?