అరెరే.. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అయినా కాలేదు! అప్పడే ఐటీ పడిపోతోందట.. ఐటీ కంపెనీలు అన్నీ ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయట, కొత్త పెట్టుబడులు రావడం లేదట.. ఈ మాటను ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అవపోసన పెట్టి, రాష్ట పారిశ్రామిక ప్రగతి గురించి సర్వం తెలిసినవాడు ఎవరైనా చెబితే కాసేపు వినొచ్చు. అలాంటి మేదావులు ఎవరూ కూడా ఇలా నెలకూ, పదిహేను రోజులకూ తమ అభిప్రాయాలను పంచుకోరు. అయితే నారా లోకేష్ అనే మేధావి మాత్రం అప్పుడే మొదలుపెట్టేశారు!
తను ఐటీశాఖ మంత్రిగా దిగిపోవడంతో.. రాష్ట్రంలో ఐటీ ప్రగతి మాయం అయిపోయిందని లోకేష్ అన్నాడట. అయితే మీడియా ముందుకు వచ్చి అలా చెప్పలేదు లెండి. తమ వర్గం జర్నలిస్టులతో లోకేష్ ఈ మాట అన్నాడట. వాళ్ల మధ్య అలా లోకేష్ ఓపెనప్ అయిపోతాడు. తప్పులు వచ్చినా వారు కవర్ చేసేస్తారు కదా! మొత్తానికి ఏపీలో ఐటీ పడిపోతోందటండీ. పెట్టుబడులు అన్నీ వెనక్కు తీసుకుని కంపెనీలు ఉడాయిస్తున్నాడట. ఎందుకంటే.. రీజన్ సింపుల్. చంద్రబాబును ఏపీ జనాలు చిత్తు కింద ఓడించారు. నారా లోకేష్ ను ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని తేల్చారు కదా.. అందుకు!
మొత్తానికి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా లోకేష్ కామెడీలు మాత్రం తగ్గడంలేదు. అతిశయోక్తులు, అర్థంలేని కథలే ఆయన చెబుతూ పోతున్నారు. తాము ఒక రేంజ్ లో ఉధ్దరించేసినట్టుగా జగన్ మాత్రం అవేం చేయలేకపోతున్నట్టుగా లోకేష్ చెబుతుంటే.. నవ్వుకునే వాళ్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అంత చేస్తే మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది, నువ్వు ఎందుకు ఎమ్మెల్యేగా ఓడిపోయావు.. అని ఎవరైనా ప్రశ్నిస్తే లోకేష్ ఏం సమాధానం ఇస్తారో!