గరుడ శివాజీ.. వేషము మార్చెను.!

ఇప్పుడు గడ్డం ఫ్యాషన్‌ కదా.! పైగా, రాజకీయాల్లోకి వచ్చేద్దామనుకున్నాడు.. ఈ క్రమంలోనే గడ్డం బాగా పెంచేశాడు. ప్రత్యేకహోదా కోసం ఉద్యమం అన్నాడు.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడు. టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో…

ఇప్పుడు గడ్డం ఫ్యాషన్‌ కదా.! పైగా, రాజకీయాల్లోకి వచ్చేద్దామనుకున్నాడు.. ఈ క్రమంలోనే గడ్డం బాగా పెంచేశాడు. ప్రత్యేకహోదా కోసం ఉద్యమం అన్నాడు.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడు. టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో 'ఆపరేషన్‌ గరుడ'ని తెరపైకి తెచ్చాడు. చివరికి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆపరేషన్‌ గరుడ పురాణం ఎక్స్‌పర్ట్‌ శివాజీ ఎక్కడ.? అంటూ పోలీసులు వెతుకుతూ వచ్చారు. చివరికి, ఎలాగైతేనేం.. శివాజీ ఆచూకీ దొరికింది.

టీవీ9 షేర్ల వ్యవహారానికి సంబంధించి కొత్త యాజమాన్యం అలంద మీడియా ఫిర్యాదు నేపథ్యంలో శివాజీపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ ఇప్పటికే పోలీసుల యెదుట విచారణకు హాజరయ్యారు. కానీ, శివాజీ మాత్రం, అజ్ఞాతంలోనే వుండిపోయాడు. విదేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నించగా, పోలీసులకు దొరికాడు శివాజీ. అయితే, సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌కి శివాజీని తరలించిన పోలీసులు, నోటీసులు ఇచ్చి పంపించేయడం గమనార్హం.

చాన్నాళ్ళ తర్వాత కన్పించిన శివాజీని తొలుత చాలామంది గుర్తుపట్టలేకపోయారు. కారణం, క్లీన్‌ షేవ్‌తో కన్పించడమే కావొచ్చు. మొత్తంగా చూస్తే, శివాజీ ముందెన్నడూ కన్పించని కొత్త గెటప్‌లో కన్పించి చాలామందికి షాకిచ్చాడు. 'ఇదంతా తప్పించుకునే క్రమంలో వేసిన ఓ ఎత్తుగడ మాత్రమే..' అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు పడ్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో జులై 11న విచారణకు హాజరుకావాల్సి వుంటుంది శివాజీ. శివాజీ పాస్‌పోర్ట్‌ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.

ఇదిలావుంటే, తాజా పరిణామాల నేపథ్యంలో శివాజీ తన లాయర్లతో చర్చల్లో నిమగ్నమైపోయినట్లు తెలుస్తోంది. విచారణను మరోసారి తప్పించుకోవడమా.? లేదంటే, విచారణకు సహకరించడమా.? అన్నదానిపై రేపో మాపో శివాజీ ఓ స్పష్టతకు వచ్చే అవకాశముంది. పాస్‌పోర్ట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకుంటే, శివాజీ విదేశాలకు వెళ్ళే అవకాశమే లేదు ఇప్పట్లో.

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి