శ్రుతి మించి మాట్లాడారో..మంచు విష్ణు వార్నింగ్ దుమారం!

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల వ్య‌వ‌హారం రాజ‌కీయాల‌ను త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి ఐదుగురు ‘మా’ చైర్మ‌న్ బ‌రిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష రేస్‌లో ఉన్న డైలాగ్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు,…

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల వ్య‌వ‌హారం రాజ‌కీయాల‌ను త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి ఐదుగురు ‘మా’ చైర్మ‌న్ బ‌రిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష రేస్‌లో ఉన్న డైలాగ్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు, యంగ్ హీరో మంచు విష్ణు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. 

మంచు విష్ణు వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఇటీవ‌ల మంచు విష్ణుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు అగ్ర‌హీరో బాల‌కృష్ణ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మంచు విష్ణు ఓ చాన‌ల్‌తో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. 

అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ చేయాల‌ని ప‌రిశ్ర‌మ పెద్ద‌లే త‌న‌ను కోరార‌ని చెప్పుకొచ్చారు. అయితే ఆ స‌మ‌యంలో అధ్య‌క్ష స్థానానికి పోటీ చేస్తున్న‌ట్టు ఎవ‌రూ ముందుకు రాలేద‌న్నారు. ‘మా’కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణం అనే ఎజెండాతో అంద‌రూ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు మంచు విష్ణు తెలిపారు. కానీ, భ‌వ‌న నిర్మాణానికి మించి ఎన్నో స‌మ‌స్య‌లు ‘మా’లో ఉన్నాయన్నారు.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాసరి నారాయణరావు వంటి పెద్దలు ఉన్నప్పుడు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందు ఉండేవాళ్లన్నారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. సినీ పరిశ్రమకు పెద్దదిక్కు అంటూ ఎవరూ లేరని విష్ణు తేల్చి చెప్పారు. పరిశ్రమలో ఎంతోమందికి తాను సాయం చేశానని ఆయ‌న అన్నారు. అయితే ఆ పేర్లు ఇప్పుడు చెప్పనని అన్నారు. 

కొంతమంది జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని.. వాళ్లు కనుక శ్రుతి మించి మాట్లాడితే తప్పకుండా అలాంటి వాళ్ల పేర్లు బయట పెడతానంటూ విష్ణు హెచ్చరించారు. మంచు విష్ణు తాజాగా కొంద‌రు సినీ సెల‌బ్రిటీల‌కు చేసిన హెచ్చ‌రిక టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. 

ఇంత‌కూ విష్ణు నుంచి సాయం పొందిన ఆ న‌టులెవ‌రు? ప‌్ర‌స్తుతం వాళ్లు విష్ణును కాకుండా ఎవ‌రి ప్యానెల్‌లో ఉన్నార‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే జైలుకు వెళ్ల‌కుండా బ‌య‌ట తిరుగుతున్న ఆ న‌టులెవ‌ర‌నే అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఈ హెచ్చ‌రిక‌లు ఎవ‌రి గురించి? ఈ స‌మ‌యంలో ఎందుకు చేసిన‌ట్టు? అనే టాక్ న‌డుస్తోంది.