భయపెడుతున్న బ్లాక్ ఫంగస్… ?

కరోనా దశల వారీగా తన విశ్వరూపం చూపిస్తోంది. ఇపుడు రెండవ దశ కాస్తా నెమ్మదించింది అనుకుంటున్న నేపధ్యంలో మూడవ దశ కూడా రెడీగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Advertisement ఇదిలా ఉంటే రెండవ…

కరోనా దశల వారీగా తన విశ్వరూపం చూపిస్తోంది. ఇపుడు రెండవ దశ కాస్తా నెమ్మదించింది అనుకుంటున్న నేపధ్యంలో మూడవ దశ కూడా రెడీగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండవ దశ కరోనా మిగిల్చిన అనేక విషాదాలలో బ్లాక్ ఫంగస్ ఒకటి. విశాఖ వంటి జిల్లాలలో కరోనా తగ్గుముఖం పడుతున్నా కూడా బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రం ప్రతీ రోజూ రావడం వైద్య ఆరోగ్య వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది.

అదే సమయంలో బ్లాక్ ఫంగస్ మరణాలు కూడా చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటిదాకా విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ తో మృతి చెందిన వారి సంఖ్య 32కి చేరుకుంది. అదే విధంగా బ్లాక్ ఫంగస్ బాధితులు కూడా ఇంతకు పది రెట్లు అంటే 340కి చేరుకున్నారు.

ఈ నంబర్ ఒక విధంగా చూస్తే పెద్దదే అని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో ఇపుడు విశాఖ జిల్లాలో కరోనా భయంతో పాటు బ్లాక్ ఫంగస్ కలవరం కూడా ఎక్కువ అయింది. 

మరి మూడవ విడత కరోనాలో ఏ కొత్త రోగాలు వెంట వస్తాయోనని ప్రజానీకంతో పాటు అధికార వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.