ప్రభాస్ 3 సినిమాలు.. 3 అప్ డేట్స్

ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. రాధేశ్యామ్ సినిమాను క్లైమాక్స్ కు తీసుకొచ్చిన ఈ హీరో, అదే సమయంలో ఆదిపురుష్, సలార్ సినిమాలకు కూడా కాల్షీట్లు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ 3 సినిమాలు ఏఏ…

ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. రాధేశ్యామ్ సినిమాను క్లైమాక్స్ కు తీసుకొచ్చిన ఈ హీరో, అదే సమయంలో ఆదిపురుష్, సలార్ సినిమాలకు కూడా కాల్షీట్లు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ 3 సినిమాలు ఏఏ దశల్లో ఉన్నాయో చూద్దాం

రాధేశ్యామ్ సినిమా కోసం మరోసారి ఇటలీ వెళ్లాడు ప్రభాస్. అక్కడ మూవీకి సంబంధించి చిన్న షెడ్యూల్ పూర్తిచేసి ఈరోజు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. గతంలోనే చెప్పుకున్నట్టు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. రామోజీ ఫిలింసిటీలో మరో షెడ్యూల్ చేయాల్సి ఉంది.

మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి 50 రోజులు పూర్తయిన సందర్భంగా సెట్స్ లో నిన్న సంబరాలు చేశారు. ఆదిపురుష్ అనే టైటిల్ తో తయారుచేసిన ప్రత్యేకమైన కేక్ ను కట్ చేశారు. ఇటలీ లో ఉన్న కారణంగా ప్రభాస్ ఈ సెలబ్రేషన్ కు హాజరుకాలేకపోయాడు. ఓంరౌత్, సైఫ్ లాంటి వాళ్లు కేక్ కట్ చేశారు.

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ సలార్ కు సంబంధించి కూడా కొత్త షెడ్యూల్ లాక్ చేశారు. ఇటలీ నుంచి తిరిగొచ్చిన ప్రభాస్, 10 రోజులు ఆదిపురుష్ షూట్ లో పాల్గొనబోతున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఆగస్ట్ మొదటి వారం లేదా రెండో వారం నుంచి సలార్ సినిమా స్టార్ట్ చేస్తాడు.

ఈసారి షెడ్యూల్ లో సలార్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే భారీ ఫైట్ ను షూట్ చేయబోతున్నారు. ఈ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మినిమం గ్యాప్స్ లో కాల్షీట్లు సర్దుబాటు చేస్తూ.. 3 సినిమాలనూ పూర్తిచేస్తున్నాడు ప్రభాస్.