పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు నుంచి చిన్న గ్లింప్స్ వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా దీన్ని విడుదల చేసారు. ఎప్పటి నుంచో సెట్ మీదే వున్న సినిమా ఇది. ఇంకా మరో ఏడాది అయిన వుండొచ్చు అన్న అనుమానాలు కూడా వున్నాయి.
ఎందుకంటే సినిమా ఇప్పటికి సగమే పూర్తయిందన్నది ఒకటి…చేయాల్సినదంతా భారీ యాక్షన్ సీన్లు అని తెలియడం మరోటి. మొత్తం మీద ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు వదిలిన గ్లింప్స్ సినిమా జానర్ ను మరోసారి తెలియచెప్పింది.
సినిమాలో పవన్ గజదొంగ గా నటిస్తున్న సంగతి, కథాకాలం నైజాం పాలన నాటిది అన్న సంగతి తెలిసిందే. అలాంటి కాలంలో జరిగిన ఓ మల్ల యుద్ద పోటీలో పవన్ పాత్ర పాల్గొన్న సన్నివేశాన్ని గ్లింప్స్ గా వదిలారు. ఇలాంటి సీన్లు ఏ హీరో చేసినా డూప్ ను వాడాల్సిందే సిజిలు అవసరమే. కానీ వాటన్నింటిని కవర్ చేసేలా వుంటుంది హీరో స్టయిల్.
కానీ హరి హర వీరమల్లు విషయంలో అలా అనిపించలేదు. కాస్త కిట్టింపు వ్యవహారంలా అనిపించింది. పవన్ నడక, మొహం చూపించకుండానే చటుక్కున ప్రత్యర్థిని ఎత్తి పడేయడం ఇవన్నీ పూర్తిగా రక్తికట్టినట్లు అనిపించలేదు. మొత్తం మీద చాలా హడావుడి చేస్తుందనుకున్న హరి హర గ్లింప్స్ పవన్ బర్త్ డే మొక్కుబడి తీర్చుకున్నట్లు మాత్రమే అనిపించింది.