అసలే ఇరువురి పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా… మండుతోంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు కురిపించింది. టీఆర్ఎస్ నుండి కూడా అదే రితీలో రియాక్షన్ వచ్చింది.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి తెలంగాణ పర్యటనలో భాగంగా.. ఒక రేషన్ షాప్ ను తనీఖీ చేయడానికి వెళ్లిన నిర్మలా సీతారామన్ రేషన్ షాప్ ఫ్లెక్సీలో మోదీ ఫోటో లేకపోవడంపై కలెక్టర్ ను నిలదీసిన ఘటనపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ఘూటుగా స్పందించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు డబ్బులు తెలంగాణ నుండే వెళ్తున్నాయంటూ ఘాటుగా రియాక్టయ్యరు.
తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని మాట్లాడిన మాటలకు మంత్రి హరిశ్ రావు రియాక్ట్ అవుతూ తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని నిరూపిస్తే తాను రాజీనామా కు సిద్ధం అని.. చేరినట్లు తాము నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారా అంటూ నిర్మలా సీతారామన్ కు సవాల్ చేశారు.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదో సొంత డబ్బులు ఇచ్చినట్లు ప్రతి బీజేపీయోతర రాష్ట్ర ప్రభుత్వాలపై మేము డబ్బులు ఇస్తుంటే మా ఫోటోలు పెట్టడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. కేంద్రం అయిన రాష్ట్రం అయిన ఎవరూ వారి సొంత డబ్బులు కావు కాదా ప్రజలు పన్నులు కడుతుంటే ప్రభుత్వం నడుస్తుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఫోటోలకు ఉన్న ప్రాముఖ్యత ప్రజలకు పథకాలు ఎలా అందుతున్నాయో అలోచిస్తే ప్రజలకు మంచి, నాయకులకు గుర్తింపు వస్తుంది.