సినిమా వాళ్లను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపిస్తే ఎక్కడైనా ఒకటే కథ నడుస్తూ ఉంటుంది. వాళ్లు తమ సినిమాలతో, తమ వ్యాపారాలు, వ్యాపకాలతో బిజీగా ఉంటారు. తమను చట్టసభకు పంపిన ప్రజలను సదరు సెలబ్రిటీలు ఎలాగూ మరిచిపోతారు. దీనికి ఏ హీరో కూడా మినహాయింపులా కనిపించడం లేదు.
తాజాగా బాలీవుడ్ హీరో సన్నీడియోల్ తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తను ఎలాగూ నియోజవర్గానికి అందుబాటులో ఉండేది ఉండదు కాబట్టి.. తన స్థానంలో మరొకరికి సమస్యలను విన్నవించుకోవాలని సన్నీడియోల్ ప్రకటించాడు. ఆ మేరకు ఆ వ్యక్తి పేరును ప్రకటించింది.. అందుకు సంబంధించి ఒక నోట్ ను విడుదల చేశాడు ఈ హీరో.
తద్వారా.. తను నియోజకవర్గానికి అందుబాటులో ఉండటం విషయంలో పూర్తిక్లారిటీ ఇచ్చాడతను. దీనిపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. నిన్ను ఎంపీగా ఎన్నుకుంటే.. ఒక తోకను నియమించి నియోజకవర్గాన్ని అప్పగిస్తావా? అంటూ వైరిపక్షాలు సన్నీపై విరుచుకుపడుతున్నాయి.
అయితే ఇలాంటి తీరు ఏమీ కొత్తదికాదు. ఏపీలో నందమూరి బాలకృష్ణ హిందూపురంలో తన ఏజెంట్ ఒకరిని పెట్టి గత ఐదేళ్లూ బండి నడిపించారు. ఏజెంట్ నే హిందూపురంలో ఎమ్మెల్యేగా పెట్టాడు బాలకృష్ణ. ఆ విషయంలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే బాలకృష్ణ లెక్క చేయలేదు.
ఎలాగైతేనేం… ఏజెంట్ ద్వారా పాలన సాగించినా, హిందూపురంలో బాలకృష్ణ మరోసారి నెగ్గాడు. ఇలాంటి తీరునే సన్నీడియోల్ కూడా ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు!