ఓ బేబీ, జాంబిరెడ్డి సినిమాల హిట్ తో మాంచి ఊపు మీద వున్న కుర్ర హీరో తేజ సజ్జా. ఆ ఊపు మీదే మూడో సినిమా ఇష్క్ కూడా పూర్తి చేసేసాడు.
భయంకరంగా ప్రమోషన్లు కూడా చేసేసాడు. కానీ అక్కడే లక్ అడ్డం తిరిగింది. కరోనా సెకెండ్ ఫేజ్ వచ్చి లెగ్ బ్రేక్ వేసేసింది. మళ్లీ ఇప్పటికి వీలు చిక్కింది.
ఇష్క్ సినిమాను ఈ నెల 30 న థియేటర్లలోకి వదుల్తున్నారు. సెకెండ్ ఫేజ్ లాక్ డౌన్ తరువాత విడుదలవుతున్న సినిమాల తొలి జాబితాలో ఇష్క్ చేరింది. దీంతో పాటు తిమ్మరసు కూడా విడుదలవుతోంది.
ఒకప్పుడు మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజు దర్శకుడు. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో హీరో తేజ పక్కన వింక్ గర్ల్ ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించింది.