వాల్మీకి షూటింగ్ కు బ్రేక్?

హరీష్ శంకర్-వరుణ్ తేజ్ సినిమా వాల్మీకి. ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అనంతపురం ప్రాంతంలో ఈ సినిమాకు మూడురోజులు షెడ్యూలు వేసారు. కానీ ఒక్కరోజు కూడా షూటింగ్ జరపకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.…

హరీష్ శంకర్-వరుణ్ తేజ్ సినిమా వాల్మీకి. ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అనంతపురం ప్రాంతంలో ఈ సినిమాకు మూడురోజులు షెడ్యూలు వేసారు. కానీ ఒక్కరోజు కూడా షూటింగ్ జరపకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.

వాల్మీకి టైటిల్ పట్ల, లోగో పట్ల ఓ పర్టిక్యులర్ వర్గం వ్యతిరేకత వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. వాల్మీకి అని టైటిల్ పెట్టి, తుపాకులు గట్రా లోగోలో పెట్టడం ఏమిటని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇప్పుడు ఆ వర్గమే అనంతపురం ప్రాంతంలో షూటింగ్ కు వచ్చి, నిరసన వ్యక్తం చేయడమే కాకుండా, షూటింగ్ ను నిలిపివేసినట్లు బోగట్టా.

దాంతో చేసేదిలేక, వారిని చర్చలకు హైదరాబాద్ రమ్మనమని చెప్పి, షూటింగ్ క్యాన్సిల్ చేసి యూనిట్ వెనక్కు వచ్చేసింది. గతంలో హరీష్ శంకర్ డిజె సినిమా సమయంలో కూడా బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా పాట రాయించి, నిరసనకు గురయ్యారు. ఇప్పుడు ఈసినిమాకు ఇలా.

బహుశా ఇలాంటి నిరసనలే తన సినిమాల విజయానికి సెంటిమెంట్ అనుకుంటున్నారేమో? దర్శకుడు హరీష్ శంకర్. తమిళ సినిమా జిగర్తాండ ఆధారంగా తెలుగులో రీమేక్ చేస్తున్న వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?