ఇస్మార్ట్ ట్రయిలర్ వస్తోంది

పూరి జగన్నాధ్-రామ్ ల కాంబినేషన్ లో చార్మి నిర్మిస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. ఈనెల 18న విడుదల. అందుకే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసారు. ఇప్పటికే…

పూరి జగన్నాధ్-రామ్ ల కాంబినేషన్ లో చార్మి నిర్మిస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. ఈనెల 18న విడుదల. అందుకే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసారు. ఇప్పటికే పాటల వీడియో బిట్ లు, టీజర్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ట్రయిలర్ రాబోతోంది. ఈ సినిమా మీద దర్శక, నిర్మాతలు పూర్తి థీమాతో వున్నారు.

అందుకే అనుకున్న ఫిగర్ వచ్చేవరకు బిజినెస్ క్లోజ్ చేయకుండా అలాగే వుంచారు. ఆంధ్ర 10 కోట్ల రేషియోలో చెబుతున్న ఈ సినిమా నైజాం మాత్రం దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. మెహబూబా లెక్కలు ఏవో వుండడంతో సినిమా ఆయన దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే ట్రయిలర్ ను ఇప్పటికే ఇండస్ట్రీ జనాలు కొందరు చూసారు. ట్రయిలర్ బాగుందని టాక్ అప్పుడే స్టార్ట్ అయింది. అయితే సినిమాలో వున్న కాస్త బూతులు చాలా పద్దతిగా, అందంగా ట్రయిలర్ లో కూడా వినిపించాయని, దాంతో ట్రయిలర్ మాంచి క్రేజీగా వచ్చిందని తెలుస్తోంది. ట్రయిలర్ వచ్చిన తరువాత బిజినెస్ కు ఊపు వస్తుందని ఇస్మార్ట్ శంకర్ యూనిట్ భావిస్తోంది. 

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?