Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్ రామ్ 'రావణ'

కళ్యాణ్ రామ్ 'రావణ'

ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో రావణ పాట ఎంత పాపులర్ నో కొత్తగా చెప్పనక్కర లేదు. ఆ క్యారెక్టర్ కూడా అంతగా పండింది. ఇప్పుడు ఆ పాట మకుటంతో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేసే అవకాశం వుంది. మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు ఇచ్చిన కథతో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. కాస్త ఎక్కువ బడ్జెట్ తో తయారయ్యే ఈ సినిమా కథ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో వుంది.

ఈ సినిమాకు రావణ అనే టైటిల్ అయితే యాప్ట్ గా వుంటుందని యూనిట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ వినిపించింది. కానీ ఆ టైటిల్ అయితే సినిమా మేకింగ్ పరంగా కొన్ని సమస్యలు వస్తాయని, అదీకాక మాస్ లో పవర్ ఫుల్ గా వుండకుండా, ఫన్నీగా వుంటుందని, అందుకే రావణ అంటే పవర్ ఫుల్ గా వుండడమే కాకుండా, మేకింగ్ లో కాస్త భారీతనం కనిపించేలా చేయడానికి వీలుగా వుంటుందని అనుకుంటున్నారట.

ఇవన్నీ ఫైనల్ అయితే రావణ అనే టైటిల్ తో కళ్యాణ్ రామ్ సినిమా అనౌన్స్ అవుతుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా మధ్యలోనే ఈ సినిమా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?