ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడుకు ప్రివిలేజ్ కమిటీ తాజాగా నోటీసులు ఇచ్చిందని కమిటీ ప్రెసిడెంట్ కాకాని గోవర్ధన రెడ్డి చెబుతున్నారు. ఈ నోటీసులకు రెస్పాండ్ అయి నేరుగా ప్రివేజ్ కమిటీ ముందు హాజరు కావాలని కోరినట్లుగా ఆయన పేర్కోంటున్నారు.
మరి అచ్చెన్నాయుడు ప్రివిలేజి కమిటీ ముందుకు వస్తారా అన్నదే ఇక్కడ చర్చ. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడు అచ్చెన్నాయుడు సభను తప్పుతోవ పట్టించేలా వ్యాఖ్యలు చేఅశారన్న దాని మీదనే ఈ నోటీసులు అని అంటున్నారు.
దీని మీద అచ్చెన్న గతంలో ఇచ్చిన వివరణ సరిగ్గా లేదని చెబుతున్నారు. మరి ఈసారి ముఖాముఖీ ఆయన్ని పిలిచి వివరణ తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ భావిస్తోంది.
అచ్చెన్నాయుడు ని గతంలో ఈ ఎస్ ఐ స్కాం లో అరెస్ట్ చేస్తే గగ్గోలు పెట్టిన టీడీపీ పెద్దలు ఇపుడు మళ్లీ యాగీకి రెడీ అవుతారా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి అచ్చెన్న వచ్చినా, రాకపోయినా కూడా సంచలనమే అవుతుంది అంటున్నారు. చూడాలి మరి.