ఈ వివ‌ర‌ణ చూశారా…న‌వ్విపోతారు!

హైద‌రాబాద్‌లోని కోకాపేట‌, ఖానామెట్ భూముల వేలంపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఓ వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ వివ‌ర‌ణ‌లోని ఓ అంశం చ‌దివితే… న‌వ్వుకోకుండా అస‌లు ఉండ‌లేర‌బ్బా.  Advertisement భూముల వేలంపై ఆరోణ‌లు…

హైద‌రాబాద్‌లోని కోకాపేట‌, ఖానామెట్ భూముల వేలంపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఓ వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ వివ‌ర‌ణ‌లోని ఓ అంశం చ‌దివితే… న‌వ్వుకోకుండా అస‌లు ఉండ‌లేర‌బ్బా. 

భూముల వేలంపై ఆరోణ‌లు నిరాధార‌మ‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం చెప్పుకొచ్చింది. కానీ కోకాపేట భూముల వేలంలో రూ. 1000కోట్ల అవినీతి జరిగిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఈ ఏడాది జూలై 5, 16వ తేదీల్లో జ‌రిగిన వేలంలో కోకాపేట్‌కు సంబంధించి 49.45 ఎక‌రాల విస్తీర్ణం గ‌ల స్థ‌లాన్ని 8 ప్లాట్లుగా, ఖానా మెట్‌లో 15.01 ఎక‌రాల విస్తీర్ణం గ‌ల స్థ‌లాన్ని 5 ప్లాట్లుగా వేలం వేసిన‌ట్లు ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. భూముల వేలం పార‌ద‌ర్శకంగా జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. వేలంలో పాల్గొన‌కుండా ఎవ‌రినీ నియంత్రించ‌లేదని తెలిపింది. ఎవ‌రైనా ఒక బిడ్‌ను ప్ర‌భావితం చేస్తార‌నేది అపోహ మాత్ర‌మే అని వెల్ల‌డించింది.

ఇక వేలం పాట‌లో పాల్గొనేందుకు ఎంత స‌మ‌యం ఇచ్చారో ప్ర‌భుత్వం చెప్పింది వింటే ఆశ్చ‌ర్యం పోకుండా ఉండ‌లేరు. ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించామ‌ని, ఆ నిర్ణీత స‌మ‌యంలో  ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్‌ని ఖరారు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. ఔను మ‌నం ఇందాకా స‌మ‌యం గురించి చ‌దివింది నిజ‌మే. 

కేవ‌లం 8 నిమిషాల స‌మయాన్ని మాత్ర‌మే బిడ్ వేయడానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు ప్ర‌భుత్వమే స్వ‌యంగా చెప్పింది. ఇంత త‌క్కువ స‌మ‌యం ఎందుకిచ్చారో, ఎవ‌రి కోసం ఇచ్చారో, అందులో మ‌త‌ల‌బు ఏంటో …ఎవరెవ‌రి సృజ‌నాత్మ‌క‌శ‌క్తిని బ‌ట్టి వారు ఊహించుకుని ఓ అభిప్రాయానికి రావ‌చ్చు.