కామంతో కళ్లు మూసుకుపోతే కరోనా ఏం చేస్తుంది!

వనస్థలిపురం.. హైదరాబాద్ లోని కరోనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం అధికారులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి అనుమానిత రోగులకు కరోనా పరీక్షలు…

వనస్థలిపురం.. హైదరాబాద్ లోని కరోనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం అధికారులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి అనుమానిత రోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓవైపు ఇంత తతంగం నడుస్తుంటే, మరోవైపు ఇదే ఏరియాలో గుట్టుచప్పుడు కాకుండా రాసలీలలు సాగిస్తున్నాడు ఓ మున్సిపల్ వైస్ ఛైర్మన్.

లాక్ డౌన్ టైమ్ లో కూడా రోజూ బయటకు వెళ్తున్నాడు వైస్ ఛైర్మన్ అనీల్. కీలక పదవిలో ఉన్నాడు కాబట్టి పనులు ఉంటాయని అనుకుంది ఆమె భార్య. అయితే కొన్ని రోజులుగా భర్త మరీ బిజీ అయిపోవడం గమనించింది. కరోనా సహాయక చర్యలు కావనే విషయాన్ని గ్రహించింది. కట్ చేస్తే.. తన ఇంటికి దగ్గర్లోనే ఓ లాడ్జి తీసుకొని అందులో అమ్మాయిలతో జల్సా చేస్తున్నాడని గ్రహించింది.

దీంతో స్వయంగా వైస్ ఛైర్మన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లాడ్జ్ పై రైడ్ చేశారు. వైస్ ఛైర్మన్ తో పాటు ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వైస్ ఛైర్మన్ ఫ్రెండ్, లాడ్జ్ ఓనర్ ను కూడా అరెస్ట్ చేశారు.

ఓవైపు కరోనా భయం అందర్లో నెలకొన్న వేళ.. ఇలా భార్య కళ్లుగట్టి వైస్ ఛైర్మన్ స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి రాసలీలలు చేయడంతో అంతా అవాక్కయ్యారు. కామంతో కళ్లు మూసుకుపోయినప్పుడు కరోనా ఉన్నా పట్టించుకోరనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.

నీ వల్ల గోదావరి పుష్కరాల్లో చనిపోయినోళ్ళకి ఏమిచ్చావ్