దిల్ రాజు పెళ్లి నేడే

టాలీవుడ్ టాప్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ రోజు రాత్రి నగర శివార్లలోనే ఓ ఫామ్ హవుస్ లో ఈ పెళ్లి సన్నిహితులైన 20 మంది సభ్యుల మంది…

టాలీవుడ్ టాప్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ రోజు రాత్రి నగర శివార్లలోనే ఓ ఫామ్ హవుస్ లో ఈ పెళ్లి సన్నిహితులైన 20 మంది సభ్యుల మంది ఈ పెళ్లి జరగబోతోంది. రేపు ఉదయం మీడియాకు పెళ్లి ఫోటోలు విడుదల చేసే అవకాశం వుంది. 

కొన్నాళ్ల క్రితం దిల్ రాజుకు సతీ వియోగం కలిగింది. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే వుంటున్నారు. అలాంటి టైమ్ లో మళ్లీ పెళ్లి ఆలోచనకు వచ్చారు. ఈ విషయాన్ని తొలిసారి గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన గ్రేట్ ఆంధ్రతో మాట్లాడుతూ, అందరికీ చెప్పే చేసుకుంటా అని, ఏప్రియల్ ఆ టైమ్ లో వుండొచ్చని హింట్ ఇచ్చారు.

లాక్ డౌన్ లేకుండా వుంటే ఈ పెళ్లి బాగా జరిగివుండేది. ఎందుకంటే ఇండస్ట్రీ కింగ్ పిన్స్ లో ఆయన ఒకరు. కానీ లాక్ డౌన్ కారణంగా చాలా కొద్ది మంది కుటుంబ సభ్యుల నడుమ ఈ పెళ్లి జరగబోతోంది. ఫామ్ హవుస్ అంటే బహుశా ప్రకాష్ రాజ్ (షాద్ నగర్) లో అని టాక్ అయితే వుంది.