మెగాస్టార్ కు స్టార్ డైరక్టర్లు దూరమా?

మెగాస్టార్….రీ ఎంట్రీ..ఖైదీ 150 సినిమా వివి వినాయక్ డైరక్టర్  Advertisement సైరా..భారీ సినిమా. సురేందర్ రెడ్డి డైరక్టర్.. మూడో సినిమా ఆచార్య. కొరటాల శివ. ఇదంతా ఓ విధంగా ఆరోహణ క్రమం. కానీ ఇప్పుడు…

మెగాస్టార్….రీ ఎంట్రీ..ఖైదీ 150 సినిమా వివి వినాయక్ డైరక్టర్ 

సైరా..భారీ సినిమా. సురేందర్ రెడ్డి డైరక్టర్..

మూడో సినిమా ఆచార్య. కొరటాల శివ.

ఇదంతా ఓ విధంగా ఆరోహణ క్రమం. కానీ ఇప్పుడు ఇది రివర్స్ లోకి మారుతోంది. సుజిత్, బాబీ అంటూ అవరోహణా క్రమం కనిపిస్తోంది. ఏమిటి కారణం? త్రివిక్రమ్, సుకుమార్ లాంటి వాళ్లు ఎందుకు మెగాస్టార్ వైపు చూడడం లేదు. తివిక్రమ్ తో సినిమా వుంటుందని దాదాపు మెగాస్టార్ అని చెప్పినా, అదేమీ మెటీరిలైజ్ అయ్యే వ్యవహారం కాదని అర్థం అయిపోయింది. 

పైగా కొరటాల శివ గ్రేట్ ఆంధ్ర కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయం స్పష్టంగా చెప్పారు. ఇకపై ఏ హీరో దొరికితే, ఆ హీరోతోనే సినిమా చేస్తానని, హీరోల కోసం వెయిట్ చేయనని చెప్పేసారు. అంటే ఇండైరక్ట్ గా రెండేళ్ల తన సమయం వృధాపోయిందనే బాధ ధ్వనిస్తోంది.

ఈ లెక్కన చూసుకుంటే ఇక మీడియం రేంజ్  డైరక్టర్లతోనే మెగాస్టార్ సరిపెట్టుకోవాల్సి వుంటుందేమో? ఇక్కడ డైరక్టర్ల వర్గాలు ఓ మాట అంటున్నాయి. చిరంజీవి మెగాస్టార్. పెద్ద డైరక్టర్లు సినిమాలు చేస్తే, తమ స్క్రిప్ఠ్, తమ మాటే చెల్లుబాటు అయ్యేలా వుంటుంది వ్యవహారం. అలాంటిది మెగాస్టార్ దగ్గరకు వెళ్తే ఎంతో కొంత రాజీ పడాలి. డిస్కషన్లు చేయాలి. అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అనే వ్యవహారాలు వుంటాయి. 

అక్కడే పెద్ద హీరోలు జంకేస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా 150 సినిమాలు చేసేసిన మెగాస్టార్ కోసం కొత్త సబ్జెక్ట్ తీసుకురావడం అంత వీజీ కాదు. యూత్ కు నప్పేవి ఆయనకు నప్పవు. ఆయన 64 ఏళ్ల వయస్సును, పరిమితులను దృష్టిలో  పెట్టుకోవాలి. ఇదంతా చాలా క్లిష్టమైన వ్యవహారం. అలా అని రీమేక్ లు చేయడానికి టాప్ ఆర్డర్ డైరక్టర్ లు పెద్దగా ఇష్టపడరు.

బహుశా అందుకే కావచ్చు సుజిత్, బాబీ లాంటి మిడిల్ ఆర్డర్ డైరక్టర్లతోనే మెగాస్టార్ ముందుకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. డైరక్టర్ సంగతి అలావుంచితే, రీ ఎంట్రీ తరవాత పెద్ద హిట్ ను కొట్టినా సైరా ప్రాజెక్టు బాగా డిలే కావడం, డిలో అయినా హిట్ కాకపోవడం అన్నది పెద్ద మైనస్ అయింది. దానికి తోడు ఆచార్య సినిమా కూడా అదే దారి పట్టింది. 

ఆచార్య సినిమా హిట్ కావడం మీదే మెగాస్టార్ తరువాత సినిమాల వ్యవహారం ఆధారపడి వుంటుంది. అందులో మరో ఆలోచన లేదు. ఎందుకంటే ఎంత సిజి వర్క్ లాంటి ఆధునిక వ్యవహారాలు వున్నా, వయస్సు మీదపడిన పరిమితులు ఆయనకు వుండనే వుంటాయి. కథలు కరువుకావడం, హీరోయిన్లు దొరక్క పోవడం, డైరక్టర్లు సెట్ కాకపోవడం వంటి సమస్యలు గతంలో బాలయ్యకు వుండేవి. 

ఇప్పుడు అవి మెలమెల్లగా మెగాస్టార్ కు కూడా తప్పడం లేదు.  దీన్ని అధిగమించాలి అంటే ఆయన లేటెస్ట్ మూవీ ఆచార్య కూడా బ్లాక్ బస్టర్ కావాలి. అన్నీ బాగుండి వుంటే ఈపాటికి ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చేసి వుండేది. కానీ కరోనా కారణంగా వెనక్కు వెళ్లిపోయింది. ఆర్ఆర్ఆర్ రాదని వినిపిస్తోంది కాబట్టి సంక్రాంతి కి వస్తుందని మెగాభిమానుల ఆశ. అదే ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి అంటే ఆచార్య ఏకంగా 2021 సమ్మర్ కే.

అప్పటి నిజాలు బయటపెట్టిన కొడాలి నాని

చంద్రబాబుని అలా వదిలెయ్యకు తల్లీ