బాబుకు అన్నీ గుర్తుకువస్తున్నాయి…!

విశాఖ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. అందులో ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఇవి ఈనాటివి కాదు, దశాబ్దాలుగా కొనసాగున్నాయి. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఘటనతో ఇపుడు అందరి ద్రుష్టి వీటి…

విశాఖ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. అందులో ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఇవి ఈనాటివి కాదు, దశాబ్దాలుగా కొనసాగున్నాయి. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఘటనతో ఇపుడు అందరి ద్రుష్టి వీటి మీద పడింది. అయితే జనవాసాల మధ్య ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు ఉండకూడదు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని తాపీగా సుద్దులు చెబుతున్నారు. అలా చెప్పడానికి బాబుకు ఉన్న నైతిక  హక్కు ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.

చంద్రబాబు ఉమ్మడి ఏపీకి దాదాపు తొమ్మిదేళ్ళ పాటు సీఎంగా పనిచేశారు. ఆయన మొదటి సారి సీఎంగా ఉండగానే 1997 సెప్టెంబర్లో విశాఖలోని కీలకమైన కర్మాగారం హెచ్ పీ సీ ఎల్ లో భారీ ప్రమాదం జరిగి అప్పట్లో 60 మంది దాకా చనిపోయారు.  మరి ఆ దుర్ఘటన తరువాత అయినా బాబు వంటి వారు విశాఖ భద్రతపైన  సమగ్రమైన ఆలోచన చేసి ఉంటే మళ్ళీ ఈనాటి ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వారూ ఉన్నారు. ఇక గత ఆరు దశాబ్దాలుగా ఎల్జీ పాలిమార్స్ పనిచేస్తోంది. బాబు సీఎంగా పదమూడేళ్ల పై చిలుకు ఉన్నారు.

మరి ఏనాడూ ఆయన విశాఖలో జనవాసాలకు ఈ కర్మాగారలు దూరంగా ఉండాలని ఆలోచన చేయలేదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా 2918లోనే పాలిమార్స్ ఉత్పత్తిని 400 నుంచి 600 టన్నులకు పెంచుకోవడానికి అనుమతించారని కూడా చెబుతున్నారు. మరి తన హయాంలో ఈ సంస్థను పట్టించుకోకుండా కనీసం ఏడాది కూడా పూర్తి చేసుకోని  తమ ప్రభుత్వంపైన విమర్శలు చేయడమేంటి బాబూ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ గట్టిగా తగులుకున్నారు.

మీరు అధికారంలో ఉన్నపుడు పాలిమార్స్ జనవాసాల మధ్య ఉందన్న సంగతి తమరికి  తెలియదా బాబూ  అని సూటిగా బొత్స ప్రశ్నించారు. బాధితులను ఆదుకునేందుకు జగన్ మానవతా ద్రుక్పధంతో పనిచేస్తూంటే తీరి కూర్చుని విమర్శలు చేయడమేంటని ఆయన మండిపడ్డారు.

ఇక విశాఖ చుట్టూ ఉన్న ప్రమాకరమైన పరిశ్రమల  గురించి తాము గతంలో ఎన్నోసార్లు అప్పటి  ప్రభుత్వాలకు విన్నపాలు చేశామని విశాఖకు చెందిన మేధావులు చెబుతున్నారు. మరి ఆనాడు వచ్చిన విన్నపాలను బుట్టదాఖలు చేసిందెవరో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న టీడీపీ సమాధానం చెబితే బాగుంటుందేమోనని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇప్ప‌టికీ శ్రీదేవితో చేసిన డాన్స్ లే గుర్తొస్తున్నాయి