సబ్ కమిటీపై సీరియస్.. టార్గెట్ పెట్టిన జగన్

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీయడంతో పాటు వివిధ పథకాలు, ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చే లక్ష్యంతో ఏర్పాటైన సబ్ కమిటీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. సబ్-కమిటీ మరింత…

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీయడంతో పాటు వివిధ పథకాలు, ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చే లక్ష్యంతో ఏర్పాటైన సబ్ కమిటీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. సబ్-కమిటీ మరింత సీరియస్ గా పనులు చేయాలని, ఏమాత్రం అలసత్వం చూపినా అసలు విషయాలు మరుగున పడిపోతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా సబ్ కమిటీకి 45 రోజులు టార్గెట్ విధించారు సీఎం.

మంత్రులు కురసాల కన్నబాబు, గౌతమ్ రెడ్డి, అనీల్ కుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గనతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారు జగన్. వీళ్లను వివిధ గ్రూపులుగా విడిపోయి, అనుబంధ కమిటీలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. 30 అంశాలపై కూలంకుషంగా కూపీ లాగాలని, అవినీతిని వెలికితీయాలని వాళ్లకు సూచించారు. అయితే అనుబంధ కమిటీల ఏర్పాటును ఇప్పటివరకు అమలుచేయలేదు మంత్రులు. వీటితో పాటు పని విభజన కూడా జరగలేదు.

ఈరోజు సమావేశంలో ఈ విషయాలు తెలుసుకున్న జగన్, మంత్రులపై సీరియస్ అయ్యారు. ఇలాంటి విషయాల్లో అలసత్యం తగదన్న ముఖ్యమంత్రి.. ప్రతి 4-5 రోజులకు ఒకసారి కమిటీ సభ్యులంతా కలవాలని.. తను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని సూచించారు. ఈసారైనా పూర్తి వివరాలతో మీటింగ్స్ కు రావాలని సూచించారు. ఇచ్చిన గడువు దాటితే సహించేది లేదని కూడా తెగేసి చెప్పేశారు. 

జగన్ హెచ్చరికలతో కమిటీ ఎలర్ట్ అయింది. రేపట్నుంచి పూర్తిస్థాయిలో ఈ పనిమీద వర్క్ చేయబోతున్నాయి. ఇందులో భాగంగా… గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన చెల్లింపులు, వివిధ రకాల ఒప్పందాలపై వివిధ శాఖల అధికారులతో రేపే సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. అమరావతి భూములు, పోలవరం ప్రాజెక్టు, అర్బన్ హౌజింగ్ ప్రాజెక్టుల్లో ఎక్కువ అవినీతి జరిగిందని సబ్-కమిటీలో మంత్రులు ప్రాధమికంగా ఓ అంచనాకు వచ్చారు.