విగ్రహాల నిమజ్జనానికి కొత్త ఆలోచన

వినాయకచవితితోనే పండుగ వస్తుంది. సరదా తెస్తుంది. అయితే చవితి పూర్తి అవుతూనే విగ్రహాలను నిమజ్జనం చేయడం అనే మరో భారీ కార్యక్రమం ఉంది. మట్టి వినాయకులనే దాదాపుగా అందరూ వాడుతున్నారు కానీ వాటిని నిమజ్జనం…

వినాయకచవితితోనే పండుగ వస్తుంది. సరదా తెస్తుంది. అయితే చవితి పూర్తి అవుతూనే విగ్రహాలను నిమజ్జనం చేయడం అనే మరో భారీ కార్యక్రమం ఉంది. మట్టి వినాయకులనే దాదాపుగా అందరూ వాడుతున్నారు కానీ వాటిని నిమజ్జనం చేయడం కోసం ప్రజలు చెరువులు బావులకు వెళ్ళి ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకుంటున్నారు.

అలాగే కొన్ని చోట్ల పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలు కూడా జరుగుతున్నాయి. దాంతో విశాఖ జీవీఎంసీ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. నిమజ్జనానికి జనానికి శ్రమ లేకుండా సిటీ మొత్తం పదహారు టెంపరరీ ట్యాంకులను ఏర్పాటు చేశారు.

అంటే ఈ మొబైల్ ట్యాంకులు ప్రతీ జంక్షన్లో  ఉంటాయన్న మాట. వాటి నిండా నీరు నింపి ఉంచుతారు. దాంతో ప్రజలు వాటిని ఈ ట్యాంకులలో సులువుగా ఏ శ్రమా లేకుండా నిమజ్జనం చేయవచ్చు. ఆ విధంగా చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినట్లు అవుతుంది. బీచ్ చెరువులలోకి జనాలు దిగి జనాలు ప్రాణాలు తీసుకునే ముప్పు తప్పుతుందని అధికారులు ఇలా కొత్త ఆలోచన చేశారు.

ఇక విశాఖలో రెండు తెలుగు రాష్ట్రాలలో అతి భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 102 అడుగులు గణపతి విగ్రహాన్ని విశాఖలోని దొండపర్తిలో వైఎస్ జగన్ యువసేన ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. ఇక గాజువాకలో 86 అడుగులు ఎత్తున మరో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తెలుగు స్టేట్స్ లో అతి పెద్ద విగ్రహలు ఇపుడు విశాఖలోనే ఏర్పాటు అయ్యాయన్న మాట.