తెలంగాణ సీఎం కేసీఆర్ మరో మారు జాతీయ టూర్ కు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ నేడు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. గాల్వన్ లోయలో అమరులైన ఐదుగురు బీహార్ సైనిక కుటుంబాలను, సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన వలస కూలీల కుటుంబాల వద్దకు వెళ్లి పరమర్శించి వారికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు.
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన భాగంగా ఆ రాష్ట్ర సీఎం నితిశ్ కుమార్ తో ప్రతేక్యంగా భేటి అవ్వనున్నారు. బీజేపీ నుండి బయటకి వచ్చి ఆర్జేడితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసీన తర్వాత కేసీఆర్ కలవడం ప్రధాన్యత నెలకొంది. గత వారం ఒక బహిరంగ సభలో ప్రజలతో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ధామా అని అన్నారు.
ఇప్పటికే అర్జేడీ నేత బీహార్ డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయినా విషయం తెలిసిందే. ఇవాళ బీహార్ పర్యటనకు వెళ్తున్నా కేసీఆర్ తో ఆర్జేడీ నేతలు భేటీ అవుతారా లేక బీహార్ సీఎం నితిష్ తోనే భేటీ అయి వచ్చేస్తారా అనేది ఆసక్తికకరంగా ఉండనుంది.
కాంగ్రెస్, బీజేపీయేతర ప్రధాన మంత్రి అభ్యర్ధిగా బీహార్ సీఎం నితిష్ కూమార్ వచ్చే ఎన్నికల్లో నిలబడుతున్నట్లు వాస్తున్నా వార్తలతో ఇవాళ సీఎం కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాలల్లోకి వెళ్తారా లేక నాన్ కాంగ్రెస్, బీజేపీ కూటమిలతో జత కడతారా అనేది ఇవాళ తెలియబోతున్నాట్లు తెలుస్తోంది.